IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Horoscope Today 9th May 2022: ఉద్యోగం మారాలనుకుంటే ఈ రాశుల వారికి ఇదే శుభసమయం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 9 సోమవారం రాశిఫలాలు

మేషం
వ్యాపారంలో వచ్చే సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గుండె జబ్బులున్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉద్యోగులు పని నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయవద్దు. ప్రేమికుల ముధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

వృషభం
షేర్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. బంధువులను కలుస్తారు. కళారంగంతో అనుబంధం ఉన్నవారు ముందుకు సాగే అవకాశాలు పొందుతారు. పనికిరాని వాదోపవాదాల్లో తలదూర్చకండి. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.   మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు.

మిథునం
తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పెద్ద పెద్ద ఇబ్బందులు దూరమవుతాయి. ఉదయాన్నే మానసిక స్థితి ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారం పెంచుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.  సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు కొత్త కంపెనీ నుంచి జాబ్ ఆఫర్‌ పొందుతారు.  తెలియని అడ్డంకిని అధిగమిస్తారు.

Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి

కర్కాటకం
వ్యాపారంలో కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని మతపరమైన ప్రయాణం కోసం ప్రయత్నాలు చేస్తారు. .విద్యార్థులు తమ కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. 

సింహం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.  కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.  ముఖ్యమైన పనులు చేయకండి. పిల్లల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. గొంతు ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో కలిసి షికారు వెళ్తారు. ప్రేమికుల మధ్య సఖ్యత ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.  స్నేహితులతో సమయం గడుపుతారు.

కన్యా
కార్యాలయంలోని అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.  విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. పాత మిత్రులను కలుస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు అనుకూల సమయం.  మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  రిస్క్ తీసుకోకండి.

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

తులా
కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.  కొత్త పనులు ప్రారంభమవుతాయి. భవిష్యత్ కి సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు.  మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి.  అనుకున్న ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. శుభవార్త అందుతుంది.

వృశ్చికం
జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారంలో కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. కొంచెం కష్టపడితే మంచి విజయం సాధిస్తారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో అలసత్వం వహించవద్దు. ఎలాంటి పుకార్లపై పెద్దగా దృష్టి పెట్టవద్దు. పూర్వ మిత్రులను కలుస్తారు.

ధనుస్సు 
బంధువులు మీపై కోపంగా ఉంటారు. ఆపదలో ఉన్నవారికి మీరు సహాయం చేస్తారు.  ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు.  ప్రయాణం వాయిదా వేయడానికి ప్రయత్నించండి. కొన్ని కారణాల వల్ల కార్యాలయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించవచ్చు. వ్యాపార భాగస్వాములపై ​​నిఘా ఉంచండి.

Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప

మకరం
మీ దినచర్యలో మార్పు తీసుకురండి. ఈ రోజు మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగం మారాలనుకుంటే ఇంచే మంచి సమయం. మీ బాధ్యతలు పెరుగుతాయి. పని  ఒత్తిడిని పెరుగుతుంది.  ఎండల్లో తిరగడం వల్ల తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు.

 కుంభం
కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు.  ఆర్థిక లావాదేవీలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు పూర్తి సమాచారాన్ని పొందండి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడతారు. భావోద్వేగ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో ఉద్యోగులతో వాగ్వాదం ఉండొచ్చు.  మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి.

 మీనం
స్నేహితుల నుంచి మీకు సహాయం అందుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయం దాచొద్దు. భారీ వస్తువులను ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోవడం మానుకోండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Published at : 09 May 2022 05:31 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Horoscope Today 9th may 2022

సంబంధిత కథనాలు

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి