Horoscope Today 25th April 2022: తొందరపాటు నిర్ణయం ఈ రాశి వారికి హాని కలిగిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 25 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆస్తి లావాదేవీల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.
వృషభం
స్నేహితులను కలుస్తారు. మీరు వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు ఎంతగానో సహకరిస్తారు. ఆఫీసులో అధికారులతో సరదాగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులను హడావుడిగా చేయాల్సి ఉంటుంది. వాహనం జాగ్రత్తగా నడపండి.
మిథునం
మీకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మనసులోని విషయాలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. పనిని ప్రారంభించే ముందుగా అన్ని సన్నాహాలు చేయండి. మాంగ్లిక్ కార్యక్రమంలో పాల్గొంటారు
Also Read: వేదం చివర్లో 'శాంతి శాంతి శాంతి' అని మూడుసార్లు అంటారు కదా ఎందుకు
కర్కాటకం
కొంత గందరగోళం కారణంగా, మీ మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. ఒత్తిడికి లోనవుతారు. అశాంతి ఉంటుంది. కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. బద్ధకం కారణంగా పని దెబ్బతింటుంది. ఈ రోజు మీరు పనిపై పూర్తి శ్రద్ధ పెట్టలేరు. డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడతారు.
సింహం
వ్యాపార పరిస్థితులు బావుంటాయి. మీ మనసులో కొత్త ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సామాజికంగా గౌరవం పొందుతారు. స్నేహితుని సహాయంతో మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్యా
ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మనసులో అనేక ప్రణాళికలు కొనసాగుతాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు అప్పుతీసుకోవాల్సి రావొచ్చు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు.
తులా
ఈ రోజు మీకు మంచి రోజు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. పిల్లల ప్రవర్తన పట్ల మీరు చాలా సంతోషిస్తారు. వ్యాపారంలో అవసరమైన భాగస్వామ్యం ఉండవచ్చు. కార్యాలయంలో శుభవార్త వింటారు.
వృశ్చికం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. శత్రువులు చురుకుగా ఉంటారు. యాత్రను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అదృష్టం మీద ఆధారపడి ఏ పనిని వదిలిపెట్టవద్దు. కుటుంబ ఖర్చులు పెరగుతాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
Also Read: ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంతానం- మీ సమస్యను బట్టి మీరు పఠించాల్సిన శ్లోకాలివే
ధనుస్సు
మండే వేడిలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ నిబంధనలను పాటించండి. ఓ మంచి సమాచారం పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. జ్ఞానవంతులను కలుస్తారు. ఈరోజు ఆఫీసులో పనులు సులభంగా పూర్తవుతాయి.
మకరం
భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి. భారీ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోవద్దు. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. కోపం తగ్గించుకోండి. నిర్వహణకు సంబంధించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. విద్యార్థులకు శుభసమయం.
కుంభం
అవివాహితులకు సంబంధం కుదురుతుంది. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. మీ ప్రవర్తన చాలా బాగుంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి రోజు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మీకు చాలా ముఖ్యం.
మీనం
ఈ రోజు ఉద్రిక్తంగా ఉంటుంది. దంపతులు సంతోషంగా ఉంటారు. అనుకున్న పనిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. బాధ, ఆందోళన వాతావరణం వల్ల మనస్సు కలత చెందుతుంది. ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడొద్దు. మీరు వివాదాల్లో చిక్కుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది