By: ABP Desam | Updated at : 13 Mar 2022 05:58 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మార్చి 13 ఆదివారం రాశిఫలాలు
మార్చి 13 ఆదివారం రాశిఫలాలు
మేషం
వ్యాపారంలో కొత్తవారు పరిచయమవుతారు. పని మీద విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ ప్రణాళికల విషయంలో గందరగోళంగా ఉంటారు. ఓపిక పట్టండి. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృషభం
ఈ రోజంతా మీకు మంచిగా ఉంటుంది. కొత్త పనుల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. బంధువులతో విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మిథునం
మీ ప్రవర్తనలో కఠినంగా ఉండకండి. నిర్ణయాలు తీసుకోవడంలో అసహనం వద్దు. సంప్రదింపులు లేకుండా ఏ పని చేయవద్దు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
కర్కాటకం
మీ నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంటారు. పిల్లల చదువు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి రోజు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read:ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
సింహం
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. భూమి క్రయ, విక్రయాల వల్ల లాభం ఉంటుంది. మీరు పాత రుణాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఒక ప్రవర్తన వల్ల బాధపడతారు. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. కష్టపడితే కానీ పనులు జరగవు. ఎవరికీ సలహా ఇవ్వకండి.
కన్య
మీ ఆరోగ్యం బాగుంటుంది. అధికారులను కలవడం వల్ల మీరు గొప్ప ప్రయోజనం పొందుతారు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. టెన్షన్ తగ్గుతుంది.
తులా
ఒక పనిని త్వరగా పూర్తి చేసే ప్రక్రియలో పొరపాట్లు చేయకుండా ఉండండి. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు మీ స్నేహితులతో వాగ్వాదం ఉండొచ్చు. బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలరు.
వృశ్చికం
ఒకరి వ్యతిరేకత వల్ల మీ పని దెబ్బతింటుంది. కానీ మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టపడితే ఫలితం అందుకుంటారు. ఉద్యోగంలో గొప్ప బాధ్యత ఉంటుంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. బడ్జెట్ ప్రభావితం అవుతుంది. ప్రయాణం చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా
ధనుస్సు
జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. వ్యాపారం గురించి చర్చిస్తారు. మీ పనిలో కొంత తప్పు జరిగే అవకాశం ఉంది. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. మీకు తెలియని వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది.
మకరం
అప్పు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాజకీయ నాయకులు లాభపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో ఫలవంతమైన చర్చలు ఉంటాయి. ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. తప్పుడు సమాచారం అందుతుంది....అప్రమత్తంగా ఉండండి.
కుంభం
వివాదాస్పద విషయాలు పరిష్కారమవుతాయి. మీ బాధ్యతను మరొకరిపై మోపకండి. కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో సహోద్యోగితో మనస్పర్థలు రావచ్చు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. మంచి ప్రవర్తనను కొనసాగించండి
మీనం
మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. వ్యాపారం పుంజుకుంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.
Panchang 5th July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
Weekly Rasi Phalalu (JUly 4 -10): ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి
Panchang 4 July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శివోపాసన మంత్రం
Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం
Panchang 3 July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అనారోగ్యాన్ని తొలగించే సూర్యుడి శ్లోకం
Why Modi Soft On KCR : సాఫ్ట్ స్పీచ్తో షాకిచ్చిన మోదీ ! విమర్శించలేదని టీఆర్ఎస్ నేతలు ఫీలవుతున్నారా ?
Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే
Harish Rao: నీళ్లు లేవా, లక్ష కోట్ల ధాన్యం ఎలా పండింది? మీ మాటల్లో విషం తప్ప విషయం లేదు - హరీష్ రావు కౌంటర్
Kohli Sledges Jonny Bairstow: ఆ కీపర్ బ్యాటర్ను రెచ్చగొడితే 10 రెట్లు సత్తా చాటుతాడు - ఆల్రౌండర్ ట్వీట్