Horoscope Today 15th February 2022: మేషరాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి, ఈ మూడు రాశులవారికి అద్భుతంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 15 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీరు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్యాపారంలో మందగమనం ఉండొచ్చు. భాగస్వామ్యానికి సంబంధించిన పనిలో నమ్మకంగా ఉండండి. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. చేపట్టిన పనిని సకాలంలో పూర్తిచేస్తారు. మీరు విభేదాలకు దూరంగా ఉండాలి.
వృషభం
మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవసరమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు గొప్ప రోజు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీడియా రంగానికి సంబంధించిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
మిథనం
ఈరోజు మీ మనస్సులో పనికిరాని ఆలోచనలు రావచ్చు. మీరు చెడు వార్తలు వినడంతో ఆందోళన చెందుతారు. అనవసరమైన పనులకు సమయం వృధా అవుతుంది. మీ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకోండి. ఈరోజు ఎవరికీ భరోసా ఇవ్వకండి, ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.
కర్కాటకం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ స్నేహితులతో ఏదైనా ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. పై అధికారులు అప్పగించిన పనులను పరిగణనలోకి తీసుకుంటే విజయం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందం జరగవచ్చు. అనుభవజ్ఞులైన వ్యక్తులు సహాయం చేస్తారు.
Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
సింహం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆఫీసులో పెద్ద బాధ్యతను నిర్వర్తించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది.
కన్య
ప్రేమికులు వివాహం దిశగా అడుగేసేందుకు ఇదే సరైన సమయం. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసి రావొచ్చు. ఫైనాన్స్‌కి సంబంధించి నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఈ రోజంతా మీరు చేసే ప్రతిపనిలోనూ ఆనందం పొందుతారు. మానసికంగా మీరు మీ పనితో సంతృప్తి చెందుతారు. మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు.
ధనుస్సు
ఎవ్వరినీ ఎక్కువగా నమ్మేయవద్దు. చాలా అలసిపోతారు. ఉద్యోగంలో సహోద్యోగుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. దగ్గు మరియు జలుబు సమస్యతో ఇబ్బంది పడతారు. గృహానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక సంబంధాలలో ఇబ్బందులు ఉండవచ్చు.
మకర
దిగుమతి-ఎగుమతి సంబంధిత కార్యకలాపాల్లో ప్రయోజనం ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం , సామరస్యం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందుతారు. మీరు శుభవార్త వింటారు. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. ఆదాయం పెరుగుతుంది.
కుంభం
ఈ రోజు మీరు తలెపెట్టిన పనులు అనుకున్నంత స్థాయిలో పూర్తిచేయలేరు. ఆఫీసులో బాధ్యత పెరగడంతో చికాకు పెరుగుతుంది. సామర్థ్యం కంటే ఎక్కువ పని చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. విలువైన వస్తువులను రక్షించండి. మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి.
మీనం
ఈ రోజు మీరు కొన్ని పనుల విషయంలో గందరగోళానికి గురవుతారు.మీ ప్రవర్తనను నలుగురు మెచ్చేలా ఉండండి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. యువతకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మానుకోండి.
Also Read: ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది, ఈ వారంలో ఏ రాశిఫలితం ఎలా ఉందంటే