By: ABP Desam | Updated at : 14 Feb 2022 07:15 AM (IST)
Edited By: RamaLakshmibai
ఫిబ్రవరి 14 సోమవారం నుంచి 20 శనివారం వరకూ వారఫలాలు
ఫిబ్రవరి 14 నుంచి 20 వరకూ వారఫలాలు
మేషం
మేష రాశి వారికి కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. ఈ వారం ఆదాయం, గౌరవం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. విలువైన వస్తువులు పోతాయనే భయం ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి.
వృషభం
వృషభ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉండి మీకు అండగా ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలుంటాయి. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రతికూలతకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి.
మిథునం
మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అప్పు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులో లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బావుంటుంది. నిరుద్యోగులకు త్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. లావాదేవీల సమయంలో అజాగ్రత్తగా ఉండకండి.
సింహం
చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సింహరాశి వారికి ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. బంధువులను కలిసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే దూర ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. మీ ఖర్చులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి.
కన్య
ఈ వారం కన్యా రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు వ్యాపార ప్రయాణాల నుంచి ప్రయోజనం పొందుతారు.
తుల
ఈ వారం తుల రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా ఉంటారు. మీరు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి, ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. సహోద్యోగులు ఆఫీసులో మీకు సహాయం చేస్తారు, పదోన్నతితో పాటు సమాచారం అందుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి.
ధనుస్సు
ఈ వారం ఈ రాశి వారికి పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువుల కోసం కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో బాంధవ్యంలో మాధుర్యం ఉంటుంది. పిల్లల కారణంగా కొందరు ఆందోళన చెందుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో చెడు వార్తలు రావచ్చు.
మకరం
ఈ రాశి వారికి ఈ వారం చాలా సంతోషకరమైన అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. అధికారులతో వాదోపవాదాలు ఉండొచ్చు. మీ ప్రతిష్టను భంగపరుచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
కుంభం
కుంభ రాశి వారు ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తాన్ని ఈ వారం అందుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మీకు సహకారం అందుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం పనికిరాని పనుల్లో చిక్కుకోకండి.
మీనం
మీరు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికలు వేయవచ్చు. ఈ వారం శుభవార్తలు అందుతాయి. బంధువులు ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారం చివరిలో, మీరు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. పెద్దలు తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
Vivasvat Saptami 2022: ఈ రోజు వివస్వత సప్తమి, సూర్యుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం