February 2022 Horoscope : ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

ఫిబ్రవరి మాసఫలితాలు

మేషం
ఈ నెల ప్రారంభంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి  ఉంటుంది. కార్యాలయంలో అధికారులతో సఖ్యత ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆహారం విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. అనారోగ్య సమస్యలున్నాయి. రహస్యాలను బహిర్గతం చేయొద్దు. 

వృషభం
వృషభ రాశి ఉద్యోగులకు ఈ నెల బావుంటుంది. అనుకున్న పనులన్నీ నేరవేరుస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారస్తులు కూడా ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ప్రమోషన్ ఉంటుంది. 

మిథునం
మిథున రాశివారికి ఈనెల మిశ్రమంగా ఉంటుంది. మీరు బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుకుంటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి.

కర్కాటకం
ఈ నెల ప్రారంభం కర్కాటకరాశివారికి చాలా బాగుంటుంది. నెల మధ్యలో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆఫీసులో పెద్ద బాధ్యత ఉంటుంది. బదిలీలు ఉండొచ్చు. రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాలయంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇంట్లో కుటుంబానికి సంబంధించిన సమస్యలను అధిగమించగలుగుతారు.

సింహం 
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం ఈ నెలలో తిరిగి పొందుతారు. ప్రభుత్వ  ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ స్థిర బడ్జెట్ గందరగోళానికి గురికావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుస్తారు. మీ కీర్తి పెరుగుతుంది.

కన్య 
ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించగలుగుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. సమయపాలన నేర్చుకోవాలి. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల
ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశించిన విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీ సమస్యలు తొలగిపోతాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కార్యాలయంలో గొప్ప విజయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంతో కలిసి వాకింగ్‌కు వెళ్లొచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

వృశ్చికం 
ఈ నెలలో ఎవరితోనైనా పెద్ద వివాదం రావచ్చు. మీరు చట్టపరమైన విషయాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీ మాటల్ని అదుపులో ఉంచుకోండి.  ఎవరినీ దుర్భాషలాడవద్దు. యువత కష్టపడి పనిచేయాలి. స్నేహితుని వల్ల మీ సమస్య తీరుతుంది. మీ దినచర్యలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి.

ధనుస్సు 
ఈ రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు.  కెరీర్ పరంగా ఓ అడుగు ముందుకేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. టెన్షన్ తగ్గుతుంది.

మకరం 
మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు. మీ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. స్నేహితులతో చర్చించే సమయంలో కొన్ని వివాదాలు రావొచ్చు.  బంధువులు ఇంటికి వస్తారు.  విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహితుల మధ్య సంబంధాలు స్థిరపడతాయి.

కుంభం 
ఈ నెల ఉద్యోగస్తులు, వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగం మారాలనకునేవారికి మంచి సమయం. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండొచ్చు. ఒత్తిడికి దూరంగా ఉండండి.

మీనం 
మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ మాసం బాగానే ఉంటుంది. కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండండి. రుణం ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..

Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..

Published at : 31 Jan 2022 07:24 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Feburary Month 2022 Masik Rashifal Feburary 2022 ఫిబ్రవరి మాస ఫలాలు 2022 మేషం

సంబంధిత కథనాలు

Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!

Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!

Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!

Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!

Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!

Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!

Horoscope 5th July 2022: ఈ రాశివారు సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, జులై 5 మంగళవారం మీ రాశిఫలితం తెలుసుకోండి!

Horoscope 5th July  2022: ఈ రాశివారు సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, జులై 5 మంగళవారం మీ రాశిఫలితం తెలుసుకోండి!

Panchang 5th July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

Panchang 5th July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

టాప్ స్టోరీస్

Raghurama : పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !

Raghurama :  పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !

CM Jagan Speech: ఏపీలో విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు, ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం జగన్ - విద్యాకానుక కిట్ల పంపిణీ

CM Jagan Speech: ఏపీలో విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు, ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం జగన్ - విద్యాకానుక కిట్ల పంపిణీ

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్