![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Horoscope Today 3 February 2022 : చెప్పుడుమాటలు విని సమయం వృధా చేసుకోకండి… ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
![Horoscope Today 3 February 2022 : చెప్పుడుమాటలు విని సమయం వృధా చేసుకోకండి… ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 3 February 2022 : చెప్పుడుమాటలు విని సమయం వృధా చేసుకోకండి… ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/54eed500399515ec7dfed42dc17e75f1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఫిబ్రవరి 3 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు దూరప్రాంతం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఒకరి మాటలకు ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. మీ బంధువులతో పూర్వీకుల ఆస్తి గురించి చర్చించవచ్చు.సంగీతం పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ రోజులో ఎక్కువ సమయం సరదాకోసం వెచ్చిస్తారు.
వృషభం
పెద్దగా పరిచయం లేని వ్యక్తులతో అనవసర వాదనలకు దిగకండి. దిగుమతి ఎగుమతితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. మీ మాట తీరుని మార్చుకోండి. అధిక కోపం ప్రదర్శించవద్దు. ధార్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తారు. మీ అధికారిక పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. అతి ఉత్సాహంతో తప్పుడు నిర్ణయం తీసుకోకండి.
మిథునం
ఉద్యోగులకు కార్యాలయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వనరుల నుంచి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సమయం ఇది. ఉద్యోగస్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరి మాటలు వింటూ సమయం వృధా చేసుకోకండి. వ్యాపారస్తులు ఈరోజు భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు.
Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
కర్కాటకం
ప్రయాణంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి..గాయపడే ప్రమాదం ఉంది. అనుకున్న పనులేవీ పూర్తికాకపోవడంతో ఆందోళన చెందుతారు. దూరంగా ఉండేవారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. విద్యార్థులు చదువుకునేటప్పుడు దృష్టి మరల్చకూడదు. స్వార్థపూరిత మిత్రులతో జాగ్రత్తగా ఉండండి.
సింహం
ఎవ్వరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. పెద్ద వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి వారు మీకు వ్యాపారానికి సంబంధించి ఓ పెద్ద వ్యక్తిని కలుస్తారు. కొత్త ఒప్పందం లాభదాయకంగా ఉంటుందని భావిస్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత పనుల్లో శ్రద్ధ వహించండి. మీ అంకితభావంతో గుర్తింపు పొందుతారు.
కన్య
ఈ రోజంతా మీకు సంతోషకరమైన రోజు. స్నేహితులతో సమీపంలోని ప్రదేశానికి ప్రయాణిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో తన బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రమోషన్‌కు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు పనికిరాని వస్తువులను కొనుగోలు చేయడానికి ఖర్చు చేయొద్దు.
Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
తుల
ఫ్రెండ్ సర్కిల్‌తో గడుపుతారు. ఈరోజు పెద్దల మాటలు శ్రద్ధగా వినండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం గురించి మీరు ఆందోళన చెందుతారు. అధిక ఖర్చులు నియంత్రించండి. ఈరోజు బంధువులతో ఫలవంతమైన చర్చ ఉంటుంది. మీ బాధ్యతలను పూర్తి అంకితభావంతో నెరవేర్చేందుకు ప్రయత్నించండి. ఈ రోజు శుభవార్త వింటారు.
వృశ్చికం
వ్యాపారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. గతంలో చేసిన ఒప్పందాల వల్ల చాలా లాభం ఉంటుంది. ఈరోజు దానధర్మాలు చేస్తారు. మీరు పూజా పఠనంపై దృష్టి పెట్టడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. మీ ఆనందం, శ్రేయస్సు కోసం కష్టపడి పని చేస్తారు. మీ పిల్లల విజయాలతో మీరు సంతోషంగా ఉంటారు.
ధనుస్సు
ఎవరికైనా తప్పుడు సమాచారం ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం మానండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. అప్పు తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేటప్పుడు సరైన చర్చలు జరపండి.
Also Read: తిరుమలేశుడి మినీ బ్రహ్మోత్సవం, ఏకాంతంగా రథసప్తమి వేడుకలు.. ఒక్కరోజే సప్తవాహనాల్లో మలయప్పస్వామి
మకరం
వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాల కారణంగా మీ మనస్సు స్థిరంగా ఉండదు. చేదువార్త వినాల్సి వస్తుంది. ప్రయాణ ప్రణాళికలు రద్దు చేయండి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల బాధలో ఉంటారు.
కుంభం
తలపెట్టిన పనులు కొన్ని విఫలం అవొచ్చు. ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తే వాటిని నెమ్మదిగా పూర్తిచేస్తారు. మీ ఇష్టదైవం వైపు మనసు మళ్లించండి. యోగా, వ్యాయామం చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇంటి పనికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల తొందరగా అలసిపోతారు. అనవసర వాదనలకు దిగకండి. చిన్న పిల్లలతో గడుపుతారు.
మీనం
ఆఫీసులో మితిమీరిన బాధ్యతలు పెరుగుతాయి. మీ పిల్లల విజయంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. దాన ధర్మాలకోసం డబ్బు ఖర్చు చేస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు చాలా కష్టపడతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)