అన్వేషించండి

Tirupati Govindaraja Swamy: చోళరాజుల కంటపడకుండా రామానుజాచార్యులు తిరుపతికి తరలించిన గోవిందరాజస్వామి విగ్రహం ఏమైంది.. ఇప్పుడు ఎక్కడుంది..

తిరుమలేశుడి దర్శనార్థం వెళ్లే భక్తులంతా తిరుపతిలో గోవిందరాజస్వామిని దర్శించుకుంటారు. అయితే వాస్తవానికి అక్కడ ఉండాల్సిన విగ్రహం అదికాదని మీకు తెలుసా. ఇంతకీ గోవిందరాజస్వామి అసలు విగ్రహం ఎక్కడుంది..

కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో అణువు అణువు  అద్భుతమే. శేషాచలంలోని ప్రతి వృక్షం, ప్రతి రాయి శ్రీవారి సేవకులే అంటాయి పురాణాలు.  శ్రీనివాసుడు స్వయంభుగా వెలసిన క్షేత్రం పరిసరాల్లో ఎన్నో పౌరాణిక, చారిత్రక ఆలయాలు,తీర్ధాలు ఉన్నాయి.  ఏడుకొండలపై వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటే.. శేషాచల పర్వత పాదాల చెంత  అన్న గారైన గోవిందరాజస్వామి వారున్నారు.  సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. అప్పట్లో చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారిని  రామానుజాచార్యులు  తిరుపతిలో ప్రతిష్టించేందుకు తరలించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆలయంలో గోవిందరాజస్వామి వారిని ప్రతిష్టించలేక పోయారు. విగ్రహానికి బదులు సున్నం,బంకమట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ గోవిందరాజస్వామి అలాగే పూజలందుకుంటున్నారు. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా రాతితో, లోహాలతో విగ్రహాలు  చూస్తుంటాం కానీ..  గోవింద రాజస్వామి వారి ఆలయంలో మాత్రం సున్నపు విగ్రహం ఉంటుంది. మరి ఇంతకీ రామానుజాచార్యులు తీసుకొచ్చిన గోవిందరాజస్వామి రాతివిగ్రహం ఏమైంది..ఎక్కడుంది...

Also Read: రామానుజాచార్యుల పైనా కీర్తనలు రాసిన అన్నమయ్య

చిదంబరంలో పూజలందుకుంటున్న గోవిందరాజస్వామిని చోళరాజులు అక్కడి‌ నుండి తొలగించి సముద్రంలో కలిపేశారు.  కొంత కాలానికి ఒడ్డుకుచేరుకున్న గోవిందరాజస్వామి ఆయన మహిమను తెలియజేశారు. ఆ సమయంలో చోళరాజుల నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు (చోళరాజులు గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో కలిపేసే సన్నివేశం కమల్ హాసన్ దశావతారం సినిమాలో చూపిస్తారు) గ్రామగ్రామాల్లో దాచుతూ చోళరాజుల కంటపడకుండా రహస్యంగా తిరుపతికి చేర్చారు. కలియుగదైవం కొలువైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలోనే గోవిందరాజస్వామివారికి ఆలయం నిర్మించాలనే ఆలోచనకు వచ్చారు.  స్ధానిక పాలకుడైన యాదవరాజు చేతుల మీదుగా 1130 వ సంవత్సరంలో తిరుపతిలో గోవిందరాజ స్వామి వారి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఎంతో మంది రాజులు, పాలకులు స్వామి వారి సేవలో తరించారు. ఈ ఆలయాన్ని  విజయనగర సామ్రాజ్య రాజులు అభివృద్ధి చేశారు. అయినప్పటికీ చిదంబరం నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహం మాత్రం ప్రతిష్టించలేకపోయారు. ఎందుకంటే... 

Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...
చిదంబరం నుంచి గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహాన్ని తిరుపతికి తరలించే సమయంలో ముక్కు, చేతులు, వ్రేళ్ళు భాగంలో కొంత లోపం వచ్చింది. దీంతో‌ ఆరాతి విగ్రహం ఆలయంలో ప్రతిష్టించే అర్హత కోల్పొయింది. విగ్రహంలోపాలను  పరిశీలించిన రామానుజాచార్యులు మరొక విగ్రహాన్ని మలచాలని నిష్టాతులైన శిల్పులకు అప్పగించారు. అయితే అదే సమయంలో కొన్ని పనుల‌ కారణంగా రామానుజచార్యలు వారు దేశ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది.. మరోవైపు రాత్రి విగ్రహం మలచే కార్యక్రమం ముందుకు సాగలేదు. దీంతో గోవిందరాజస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సమయం మించి పోతుండడంతో సున్నం, బంకమట్టితో తయారు చేసిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని  ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సున్నపు విగ్రహమే పూజలందుకుంటోంది. ఇక్కడ స్వామివారికి అభిషేకాది‌ కార్యక్రమాలను నిర్వహించరు. ఎందుకంటే సున్నం, బంకమట్టి విగ్రహం కావడంతో కరిగిపోతుందని.. నిత్యం నూనె రాసి స్వామికి అలంకరణ చేస్తారు. 

Also Read: శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…

రాతి విగ్రహం ఎక్కడ ఉందంటే..
నల్లటి రాతితో సుందరమైన శయన భంగిమలో‌ ఉన్న గోవిందరాజ స్వామి వారిని చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. అంతటి దివ్యమైన విగ్రహానికి చిన్న చిన్న లోపాలు ఉండడంతో ప్రతిష్టకు నోచుకోలేదు.  దీంతో ఆ రాతి విగ్రహాన్ని తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణికి సమీపంలో ఉన్న‌ మంచినీటి గుంటలో ఓ భారీ రావి చెట్టు క్రింద ఉంచారు. అద్భుతమైన ఆ రాతి విగ్రహం ఎలాంటి పూజలకు నోచుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే అక్కడ కూడా స్వామివారు తన మహిమను చూపించారనే చెప్పాలి... ఎందుకంటే ఎండలు మండిపోతున్నా ఆ స్వామివారి విగ్రహం ఉన్న కొలను మాత్రం ఎండిపోదు. నిత్యం అక్కడి నుంచి తీసుకెళ్లిన పవిత్రజలాన్నే గోవిందరాజ స్వామి ఆలయంలో తీర్ధంగా ఉపయోగిస్తుంటారు. కాలక్రమేణా ఆ విగ్రహం గురించి తెలిసిన భక్తులు కొందరు పూజలు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు  ఆ రాతి విగ్రహాన్ని అక్కడి‌ నుండి తీసేసి ఎస్వీ మ్యూజియంలో ఉంచేందుకు టీటీడీ ప్రయత్నించినా స్థానికులు అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. 

ఆ విగ్రహం ఉన్న మంచినీటి కుంటకు నాలుగు వైపులా గోడ నిర్మించారు. ఎక్కువ లోతు ఉండడంతో భక్తులను అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. అయితే దాదాపు వెయ్యేళ్ల చరిత్రకలిగిన గోవిందరాజస్వామి విగ్రహం ఇలా పడి ఉండడం సరికాదంటున్నారు భక్తులు. కొంతమేర ఇనుపకంచె ఏర్పాటు చేసి భక్తుల సందర్శనార్థం ఏర్పాట్లు చేయాలని, స్వామివారికి నిత్యం పూజ చేసేందుకు ఓ అర్చకుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి టీటీడీ అధికారులు ఏమంటారో చూడాలి....

Also Read: ముచ్చింతల్‌ లో రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల షెడ్యూల్ ఇదే..

Also Read: భగవంతుడు అందరివాడు అయినప్పుడు మనమెంత.. కులం కాదు గుణం గొప్పదన్న రామానుజాచార్యులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget