News
News
X

Horoscope Today 10th January 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి.. మీ రాశిఫలితం తెలుసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

జనవరి 10 సోమవారం రాశిఫలాలు

మేషం
ఈ రోజంతా  మీరు ఉత్సాహంగా పని చేస్తారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యుల నుంచి ప్రయోజనం పొందుతారు.  ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఒంటరిగా ఉండాలనుకుంటారు.  కొత్త వ్యక్తులతో దూరం పాటించండి. 

వృషభం
బంధువుల చర్యల వల్ల మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. తలనొప్పి మిమ్మల్ని బాధిస్తుంది. ఈ రాశిస్త్రీలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. 

మిథునం
పెట్టిన పెట్టుబడుల నుంచి భారీమొత్తం పొందుతారు. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. స్నేహితులతో సమయం గడపాలని కోరుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రబుత్వ పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. కొత్తగా ఏదైనా పనిని తలపెట్టొచ్చు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. 

Also Read: ఈ రాశుల వారికి ఈ సంక్రాంతి ప్రత్యేకంగా ఉంటుంది, జనవరి 09 నుంచి 15 వరకూ వారఫలాలు..
కర్కాటకం
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహోద్యోగుల ప్రవర్తన వల్ల ఆందోళన పెరుగుతుంది. సాంకేతిక సంబంధిత పనుల్లో ధనలాభం పొందుతారు. యువతకు  ఈ రోజు చాలా మంచిది. మీ ఆసక్తికి అనుగుణంగా పని చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఆశించిన ఫలితం లభిస్తుంది.

సింహం
 గతంలో పెట్టిన  పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు.  విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. వాహనం జాగ్రత్తగా నడపండి, ప్రమాదం జరగవచ్చు.

కన్య 
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడితో విభేదాలు రావచ్చు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకండి.  మీ తప్పులను అంగీకరించేందుకు మొహమాటపడొద్దు.  రహస్య చర్చలను జాగ్రత్తగా నిర్వహించండి. కుటిల వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. ఈరోజు ప్రయాణం చేయవద్దు.

Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
తుల
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.అన్ని పనులను క్రమశిక్షణతో చేస్తారు. వ్యాపారులు లాభపడతారు.   ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మంచి రోజు. తొందరపడి ఏ పనీ చేయవద్దు. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి.

వృశ్చికం
మీ పని తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు.  దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పని ఒత్తిడిలో  ఉన్నప్పటికీ మీరు చాలా సంతోషంగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విలువైన వస్తువుల భద్రతపై శ్రద్ధ వహించండి. మీ సహోద్యోగులపై నమ్మకం ఉంచండి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధనుస్సు 
అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవరితోనూ తప్పుగా మాట్లాడకండి. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీ పని పట్ల కొంత శ్రద్ధ చూపడం అవసరం.  ప్రయాణాలలో సమయాన్ని వృధా చేయకండి.ఈరోజు మీ జీవిత భాగస్వామితో చర్చించండి.పెద్దల అనుభవాలు అడిగి తీసుకుని కొన్ని పనులు చేస్తే విజయం సాధిస్తారు. 

Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
మకరం
అతి చేసే ప్రయత్నం చేయొద్దు.  స్నేహితులతో సమయం గడపొచ్చు. ఉద్యోగులు సకాలంలో పని పూర్తిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో కాస్త భయపడతారు. మీ శ్రేయోభిలాషులను అగౌరవపరచవద్దు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభం
మీ మాటలపై సంయమనం పాటించండి..తద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్ల విజయం సాధిస్తారు. 

మీనం
మీరు ఈరోజు ఆఫీసులో చాలా బిజీగా ఉంటారు. కొత్త బాధ్యతలు అందుకుంటారు. కెరీర్ ప్లాన్‌ కోసం పెద్దల సలహాలు తీసుకోవచ్చు. ఈరోజు వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు సంక్లిష్టంగా మారొచ్చు.

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read:  11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Jan 2022 06:06 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 10th 2022

సంబంధిత కథనాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5  రాశి ఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్