Horoscope Today 23 November 2021: ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం, అందులో మీరున్నారా మీ రాశి ఫలితాలు తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
![Horoscope Today 23 November 2021: ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం, అందులో మీరున్నారా మీ రాశి ఫలితాలు తెలుసుకోండి.. Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 23 November 2021: ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం, అందులో మీరున్నారా మీ రాశి ఫలితాలు తెలుసుకోండి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/20/c3b5dc942fad55d59d1e83e053e462e1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మేషం
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీలో నైపుణ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్లో మరో అడుగు ముందుకు పడాలంటే మీరు మరింత కష్టపడాలి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.
వృషభం
స్థిరాస్తి విషయంలో వివాదాలుండే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆఫీసులో టెన్షన్ పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు.
మిథునం
డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి. కొన్ని పనులకు సంబంధించి ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుకుంటారు. వ్యాపారాన్ని మరో మెట్టు పైకి తీసుకెళతారు. పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి.
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
కర్కాటకం
ఈ రోజు బాగానే ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లల పనుల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఆఫీసులో ఎవరితోనైనా గొడవ జరగవచ్చు. పెళ్లికానివారికి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
సింహం
కుటుంబంలో పనులు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. చేపట్టిన ప్రతిపనిలో ఈ రోజు ప్రతికూలత ఎక్కువ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ సన్నిహితుల మనోభావాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
కన్య
అదృష్టం కలిసొస్తుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. కార్యాలయంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకరి నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావచ్చు.
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
తుల
రోజంతా చురుకుగా, సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు శుభసమయం. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరితో పంచుకోవద్దు.
వృశ్చికం
ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈరోజు మీరు ఆకస్మిక విజయం వరించే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతిపనిలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. రోజంతా పనుల హడావుడి వల్ల అలసట వస్తుంది.
ధనుస్సు
రోజంతా బావుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
మకరం
కొన్ని పనుల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఫీసులో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభం
శుభవార్త వింటారు. యువతకు కెరీర్‌కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఆర్థి పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామి మధ్య సహకారం కొనసాగుతుంది. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు తక్కువ అవుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.
మీనం
ఈరోజు మీకు ఒత్తిడికి లోనవుతారు. ఇంట్లో ఏదైనా సమస్య కారణంగా వివాదాలు తలెత్తవచ్చు. నిలిచిపోయిన కొన్ని పనులు ఊపందుకుంటాయి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారం కోసం ప్రయాణం చేయవచ్చు. పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. పని ప్రదేశంలో మరింత బాధ్యత పెరుగుతుంది.
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)