Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 28 May 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
మే 28 శనివారం రాశిఫలాలు
మేషం
బులియన్ వ్యాపారులు ఈ రోజు కొనుగోలు మరియు అమ్మకాల వల్ల లాభపడతారు. తలపెట్టిన పని పూర్తికావడంతో మనసు ఆనందంగా ఉంటుంది. యువత తమ కెరీర్ విషయంలో యాక్టివ్‌గా ఉంటారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ట్రై చేయండి. ఓర్పు మరియు సంయమనంతో బాధ్యత తీసుకోండి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దినచర్యలో మార్పు ఉంటుంది.
వృషభం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని లేకపోవడం వల్ల మానసికంగా కలత చెందుతారు. టెన్షన్ పెరుగుతుంది. మీపై తప్పుడు ఆరోపణలు రావొచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదు. మీ పనిని వేరొకరిపై రుద్దొద్దు.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త.
మిథునం
పెట్టుబడి ద్వారా లాభం వస్తుంది. తెలియని వ్యక్తుల వల్ల మీ పని దెబ్బతింటుంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం రావచ్చు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. కుటుంబ సభ్యులు మీ నుంచి సలహాలు తీసుకుంటారు. ఖర్చు పెరుగుతుంది.
కర్కాటకం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. బంధువుల సలహాతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. జీతాల పెంపుపై అధికారులతో చర్చిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి. మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం
ఈ రోజు స్నేహితుడికి సహాయం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. పొట్టకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కష్టమైన పనులను మీ నైపుణ్యంతో పూర్తి చేస్తారు. యువత ఉద్యోగాలు పొందవచ్చు.
కన్యా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు కొంత గందరగోళంలో ఉంటారు. జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. విలువైన వస్తువులను రక్షించండి. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాల్సిందే. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తులా
భవిష్యత్తు భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. విహారయాత్రకు వెళ్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు.ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు.ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు.
వృశ్చికం
ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అపరిచితుడిని సులభంగా నమ్మవద్దు. ఆఫీసులో మీకు పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. రాజకీయ రంగంలో మీ హోదా పెరుగుతుంది. వృత్తి సంబంధ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
ధనుస్సు
పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద నిర్ణయం తీసుకుంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. చేతికి అందాల్సిన మొత్తం సరైన సమయానికి అందదు. కొత్త ఆదాయ వనరులు లాభిస్తాయి. ఒకరి మాటల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు. వ్యాపారం విషయంలో గందరగోళం చెందకండి. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయండి.
మకరం
ఈ రోజు బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించండి. సోమరితనం విడిచిపెట్టండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. పిల్లల పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటారు.
కుంభం
మీ గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. షాపింగ్‌పై చాలా ఆసక్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. బంధువులు మిమ్మల్ని అభినందిస్తారు. వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది.
మీనం
మీరు కొత్త ఉద్యోగ బాధ్యతలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీపై ప్రతికూలత పెరుగుతుంది.ప్రత్యర్థులు హాని చేయవచ్చు. రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ మార్పును పరిశీలిస్తారు.