Horoscope Today 17 December 2021: ఈ రాశి వారు సవాళ్లను అధిగమిస్తారు.. మీ రాశిఫలితాలు ఇక్కడ చూసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
బాధ్యతలు సకాలంలో పూర్తిచేస్తారు. మీ పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. తెలియని వ్యక్తుల నుంచి హాని కలగొచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఏదైనా విషయంలో మీ కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు.
వృషభం
ఈ రోజు ప్రారంభం సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు సంబంధాల సమచారం వస్తుంది. బంధువులతో చర్చలు ఉంటాయి. దూరప్రాంత ప్రయాణం చేయొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మంచి సహాయం అందుతుంది. సన్నిహితుల్లో అవసరమైన వారికి ఆర్థిక సాయం చేస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మిథునం
ఎవరితోనైనా విబేధాలు రావొచ్చు. జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఈరోజు మంచి రోజు అవుతుంది. మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి. బాధ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. మీ సమస్య పరిష్కారం అవుతుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
కర్కాటకం
తెలియని వ్యక్తుల ముందు వ్యక్తిగత విషయాలు చెప్పకండి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.
సింహం
ఉద్యోగస్తులు ప్రమోషన్ సంబంధిత సమాచారం పొందుతారు. వివాహితులు విహారయాత్రకు వెళతారు. సామాజిక సేవలో ఉత్సాహంగా పాల్గొంటారు. భగవంతుని ఆరాధించడం ద్వారా ధైర్యాన్ని పొందుతారు. ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి విజయాన్ని పొందుతారు.
కన్య
చేపట్టిన పని ఆచరణలో కొన్ని చికాకులు ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉండదు. మీకు ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. చాలా కాలం తర్వాత పాత మిత్రులను కలుస్తారు. మీ భాగస్వామి ప్రవర్తనతో మీకు కొంత సమస్య ఉండొచ్చు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు . ఆర్థికంగా కలిసొచ్చే సమయం. రిస్క్ తీసుకోకండి. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
తుల
ఈ రోజు ఏపని చేసినా విజయం వరిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగంలో పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం
ప్రణాళిక వేసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల షెడ్యూల్ ప్రకారం మీ కార్యాచరణ రూపొందించుకోండి. వృద్ధులకు సేవ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. బంధువులను కలుస్తారు. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ధనుస్సు
ఈరోజు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు కార్యాలయంలో మంచి సమాచారాన్ని పొందుతారు. బాధ్యత పెరుగుతుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీ పని పూర్తవుతుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
మకరం
బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి ఫలితాలు పొందుతారు. సోమరితనం ఉంటుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
కుంభం
అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందడం కష్టం. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. లావాదేవీ బాగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టొచ్చు. బంధువును కలుస్తారు. పూర్వీకుల వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల వైపు విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు.
మీనం
పెద్దల మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు అంతా శుభసమయం. ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు. లాటరీ, బెట్టింగ్ లకు దూరంగా ఉండండి.
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి