Horoscope 30th June 2022: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope 30-06-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జూన్ 30 గురువారం రాశిఫలాలు (Horoscope 30-06-2022)
మేషం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగడంతో ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. కుటుంబంలో కూడా విభేదాలు ఉండొచ్చు.
వృషభం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. తలపెట్టిన పని పెద్దగా ఫలితాన్నివ్వదు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.కొన్ని విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో మనసులో గందరగోళం ఉండొచ్చు. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలగుతారు.పార్టీలను ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మిథునం
ఈ రోజు ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశాలుంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. మీ సామర్థ్యంతో కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ పని తీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. ఖర్చులు అదుపులో ఉండాలి. అనవసరంగా ఎవరితోనూ వాదించకండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఆనందాన్ని ఇస్తుంది.తొందరగా అలసిపోతారు.
Also Read: ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు
కర్కాటకం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు కూడా జరగొచ్చు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి రావొచ్చు. సీజనల్ వ్యాధులబారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త.
సింహం
ఈ రోజు మీకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడటం వల్ల నష్టం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. మీ మానసిక ఒత్తిడి పెరగొచ్చు. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కన్య
వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయొద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు.మీ పనిలో వేగాన్ని పెంచండి. భాగస్వామి సహాయంతో ధనలాభం ఉంటుంది. ఉద్యోగులు ప్రత్యర్థుల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం బావుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది
తుల
వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కృషిపై నమ్మకం ఉంచండి. వ్యాపార విస్తరణ కోసం మీరు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. అధికారుల సహకారం ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. విద్యార్థులు ఎంత శ్రమించినా తక్కువ ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో మీ జీవితభాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోండి మరియు మీ మాటలను నియంత్రించండి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి.
వృశ్చికం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆకస్మికంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేపట్టే పనిలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆస్తిపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం మందగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనుల్లో అదనపు డబ్బు కూడా వెచ్చించవచ్చు. మితిమీరిన కోపం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీ భాగస్వామితో మంచి సమయం గడపండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు.
ధనుస్సు
ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలుండొచ్చు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. చిరాకు తగ్గించుకోండి. తొందరపాటు వల్ల నష్టం జరుగుతుంది. రిస్క్ తీసుకోవద్దు.
Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!
మకరం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆకస్మిక లాభాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కోపం ఎక్కువగా ఉంటుంది. మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. మానసికంగా బలంగా ఉండండి.
కుంభం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పాత పెట్టుబడులు, పాత స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. షేర్, ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగుల పరిస్థితి అంత బాగా ఉండదు. కుటుంబ సమస్య కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయి.ఆరోగ్యం బాగుంటుంది.
మీనం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. కష్టపడి పని చేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వ్యాపారం లేదా కార్యాలయ సంబంధిత పనుల కోసం టూర్ వెళతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అధిక శ్రమ కారణంగా అలసిపోతారు. స్నేహితులను నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!