Weekly Rasi Phalalu 27th june to 3rd july : ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు
weekly horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జూన్ 27 నుంచి జులై 3 వరకూ వారఫలాలు( Weekly Rasi Phalalu 27th june to 3rd july )
మేషం
ఈ వారం మేషరాశివారికి బాగానే ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా ముందే జాగ్రత్తపడాలి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచ పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికులు బంధాన్ని పెళ్లివరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ప్రయాణాలు కలిసొస్తాయి, స్థిరాస్తి కొనుగోలు చేయాల్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం
ఈ వారం ఈ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. వారం రోజులు ఉత్సాహంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుస్తారు. నిరుద్యోగులకు మంచి సమయం, అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు వారినుంచి శుభవార్తలు వింటారు. పిల్లల ఆరోగ్యం విషయం అశ్రద్ధ వద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి అన్నివిధాలుగా బావుంటుంది. అనవసర వాదనలకు దిగొద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ వారంలో ఓరోజు శుభకార్యాలకు హాజరవుతారు.
Also Read: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది
మిథునం
మిథున రాశివారికి ఈ వారం మొత్తం మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కోపాన్ని దరిచేరనీయకుండా చూసుకోండి. ఆరోగ్యం కుదుటపడుతుంది కానీ శ్రద్ధ తీసుకోవడం మానేయకండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజాకీయాల్లో ఉండేవారికి కలిసొస్తుంది. ఇంటా బయటా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పని ఒత్తిడి పెరిగినా లక్ష్యాలు పూర్తిచేస్తారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోండి.
కర్కాటకం
కర్కాటక రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ రంగంలో మీకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభఫలితాలొస్తాయి. బంధుమిత్రుల సహకారం అందుకుంది. ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. అయితే అష్టమ శని కారణంగా ప్రతిపనీ అనుకున్నదానికన్నా ఆలస్యం అయినా కొన్నింటిలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. స్థిరమైన ఆలోచనావిధానం మీకు మంచి చేస్తుంది. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.
Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
సింహం
ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. మంచి పలుకుబడి ఉన్నవ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.నూతన ఆదాయ మార్గాలుండొచ్చు. అనవసర ఖర్చులు తగ్గించండి. ఓ శుభవార్త వింటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు చాలా కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకేస్తారు. ఐ.టి నిపుణులు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవారికి అవకాశాలు బావుంటాయి. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు.
కన్య
కన్య రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, ఆదాయం బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పెద్దగా మార్పులుండవు , వ్యాపారులు మరింత కష్టపడాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కుటుంబ సహకారం తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది