Weekly Horoscope 27 June to 3 July 2022: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది
weekly horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జూన్ 27 నుంచి జులై 3 వరకూ వారఫలాలు( Weekly Rasi Phalalu 27th june to 3rd july )
తుల
ఈ వారం తులారాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయంలో పెద్దగా మార్పులుండవు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. ప్రేమికులకు ఇబ్బందులు తప్పవు. ఈ వారంలో ఓ శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది మంచి సమయం కాదు. చేపట్టిన పనులు సిన్సియర్ గా చేస్తే మాత్రమే పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కోపం తగ్గించుకోండి.
వృశ్చికం
ఈ వారం అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. మనోబలంతో అనుకున్న పనులు సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు అనుకున్న మార్పులొస్తాయి. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారులు, రైతులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
Also Read: ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు
ధనుస్సు
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని చికాకులుంటాయి. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకండి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. స్నేహితులు, సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యుల నుంచి సహాయ , సహకారాలు అందుతాయి. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రేమవ్యవహారాల్లో సమస్యలుంటాయి. రాజకీయాలు, సేవారంగం వారికి అనుకూల సమయం. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.
మకరం
ఈ వారం మకర రాశి ఉద్యోగులకు ప్రశాంతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. నిరుద్యోగులకు శుభసమయం. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు జరిగే సూచనలున్నాయి. బంధువులు, స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలం అవుతాయి. ఈ వారం మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది. మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బందిపెట్టేవారున్నారు జాగ్రత్త.
Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
కుంభం
ఈ వారం మీకు శుభఫలితాలున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మికతపై శ్రద్ధ పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు, బుద్ధిబలం ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
మీనం
ఈ వారం మీ ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనవసర విషయాల్లో కలుగజేసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈ వారం మిమ్మల్ని బాధపెట్టే వార్త వింటారు, ఆనంద పెట్టే వార్తా వింటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది