అన్వేషించండి

Dhruva Stuti: మీ పిల్లలు బాగా చదవడం లేదా.. నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారా.. ఇలా ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది !

Dhruva Stuti: చదువులో మీ పిల్లలు వెనుకబడుతున్నారా..ఎంత చదివినా మర్చిపోతున్నారా?  నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? బుద్ధిమాంద్యంతో ఉన్నారా? ఈ సమస్యల నుంచి ఉపశమనం ఇదే..

Life Story of Dhruva:  ధృవస్తుతిలో ఉన్న 12 శ్లోకాలను నిత్యం పిల్లలతో చదివిస్తే వారిలో మీరు ఆశించిన మార్పు వస్తుందంటారు ఆధ్యాత్మిక నిపుణులు.  బుద్ధిమాంద్యం వీడి జ్ఞానంవైపు అడుగులు వేస్తారు..చదువులో వృద్ధి చెందుతారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారని చెబుతారు.  

ఎవరీ ధృవుడు?
ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు...కల్లి సునీతి. ఉత్తాన మహారాజుకి మరో భార్య ఉంది..ఆమెకు పుట్టిన కొడుకు మారుటి. మహారాజుకి చిన్నభార్య అంటే ఎంతో ప్రేమ. ఇదే అలుసుగా ధ్రువుడిని తండ్రి దగ్గరకు చేరినిచ్చేది కాదు ఆమె. మహారాజు తర్వాత రాజుగా మారేది తన కొడుకే అని భావించేది. ఓసారి తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడిన ధృవుడిని కిందకు ఈడ్చేసింది. ఆ క్షణం బాధపడిన ధృవుడికి తల్లి..దేవుడిని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం అనేసింది. ఆ మాటని అనుసరించిన ధృవుడు ఘోరతపస్సు ఆచరించి... తండ్రి ఒడిలో కూర్చోవడమే కాదు.. ఆయన తర్వాత మహారాజుగా పాలించాడు. శ్రీ మహావిష్ణువు వర ప్రభావంతో మరణానంతరం ధ్రువనక్షత్రంగా మారాడు. 
 
అంటే తండ్రి ఒడిలో కూర్చునేందుకు మొదలు పెట్టిన ప్రయాణం ధృవమండలం వరకూ తీసుకెళ్లింది.. అంత శక్తివంతమైనది ధృవస్తుతి. ఈ ధృవస్తుతిలో ఉండే 12 శ్లోకాలు నిత్యం పఠిస్తే చిన్నారుల్లో ఉండే దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, మందబుద్ధితో ఉండే పిల్లలు జ్ఞానవంతులుగా మారుతారని పండితులు చెబుతారు.  

Also Read: పల్లె అందాలు, ఆలయాల విశిష్టత, భగవంతుడి గొప్పతనం వివరించే పాశురాలు.. అవే తిరుప్పావై!

శ్రీ మహావిష్ణువు కోసం ధృవుడు చేసిన స్తుతి ఇది..
ధృవస్తుతి ( Dhruva Stuti)

శ్రీ ధృవ ఉవాచ :-
యోఒన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య ఖిలశక్తిధరః స్వధామ్నా।
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్  ॥ 1

నాలోపల నిద్రించిన వాక్కును ఎవరు మేల్కొలిపాడో, నా వాక్కుకి  ప్రాణమిచ్చాడో,  హస్త - చరణ -శ్రవణ -చర్మము ఇంద్రియాలకు ప్రాణం ఇచ్చాడో..అలాంటి వాడు నాలోనే కాదు సమస్త విశ్వంలో నిండిఉండే ఆ భగవానుడైన పురుషునికి నమస్కారం
 
ఏకస్త్వమేవ భగవన్ని దమాత్మ శక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్ | 
సృష్ట్వా౭ నువిశ్య పురుషస్తదసద్దుణేషు నానేవ దారుషు విభావసువద్విభాసి ॥2

సృష్టిలో ఎన్నో ఉపాధులు, ఉపాధి భేదాలు ఉన్నప్పటికీ చైతన్య నువ్వే స్వామి. సమస్త భువనాల్లో విష్ణువు తప్ప  అన్యము లేదు. కట్టెలు పొడుగు, పొట్టి ఉన్నప్పటికీ అగ్ని అన్నిటినీ సమానంగా వ్యాపిస్తుందో అలా..విష్ణువు ప్రతి ఒక్కరిలో నిండి ఉన్నాడు.  

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్రపసన్నః । 
తస్యాపవరశరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధ ॥ 3

సృష్టి ప్రారంభం , సూర్య చంద్రుల సంచారం ఇవన్నీ నువ్వు ఇచ్చిన శక్తితోనే జరుగుతోంది. నాకు ఈ శక్తి  ఇచ్చిన వాడు భగవంతుడు అనే స్పృహ   ఉన్నంతవరకు మోహము, అజ్ఞానము రాదు. ఆ స్పృహ నాకెప్పుడూ ఉండేలా చేయి స్వామి అని నమస్కారం చేస్తున్నారు.  

Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!

నూనం విముష్టుతయస్తవ మాయయా తే యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః 
అర్బన్తి కల్పకతరుం కుణపోపభోగ్య- మిచ్చన్తి యత్స్పర్శజం నరకే౭ పిన్దాణామ్ ॥ 4

నువ్వు మాత్రమే జనన మరణ సంసార చక్రము నుంచి విముక్తి కలిగించగలవు.  కల్పవృక్షంలా నిన్ను ప్రార్థించేవారి కోర్కెలు తీర్చుతున్నావు.  మోక్షాన్నే ఇవ్వగలిగిన నిన్ను మేం  శరీర సంబంధమైన భోగాలు అగుడుతున్నాం. దీనికి కారణం నీ మాయే..మృత్యు తుల్యమైన ఈ శరీరానికి భోగాలు కావాలా? 
 
యా నిర్వృతిస్థణుభృతాం తవ పాద పద్మ ధ్యానాద్భవ జ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి
 స్వమహిమన్యపి నాథ మా భూత్ కిమ్ త్వంత కాసిలులితాత్ పతతాం విమానాత్ || 5

నీ చరణ కమల సేవే నీ పాదార్చకుల తోడి నెయ్యము ప్రసాదింపు స్వామి. నీ గురించే చెప్పుకోవటం, వినటం, ధ్యానించడం, కీర్తించడం ముందు ఆ స్వర్గం కూడా వ్యర్థమే.  సత్పురుష సాంగత్యం అంటే శ్రీ మహావిష్ణు సాంగత్యమే కదా.  

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనన్తమహతామమలాశయానామ్ | 
యేనాంజసోల్బణమురువ్యసనం భవాబ్దిం నేష్యే భవద్గుణకథామృతపానమత్తః ॥ 6

 సజ్జనుల సాంగత్యాన్ని ప్రసాదించు స్వామీ..ఆ నిర్మలమైన సజ్జనుల ద్వారా నీ కధలు వింటూ నన్ను నేను మర్చిపోవాలి. అప్పుడే ఈ భయంకరమైన జీవితం అనే సాగరాన్ని దాటగలను 
 
తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యంయే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః| 
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద- సౌగస్థ్యలుబ్ధహృదయేషు కృతప్రసంగాః ॥ 7

ఓ పద్మనాభ..శరీర సంబంధాలు కానీ, స్నేహితులు,శత్రువులు, ఇల్లు, పిల్లలు ఇవన్నీ పట్టనివారు ఎవరంటే నీ పాదాల పరిమళాలు గ్రోలే సత్ఫురుషు..వారే మాకు మార్గం చూపించాలి

తిర్యజ్నగద్విజసరీసృపదేవదైత్య- మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్ | 
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం నాతఃపరం పరమవేద్మి న యత్ర వాదః || 8

ఓ పరమాత్మ!  జంతువులూ, పర్వతాలు, కొండలు, చెట్లు, పక్షులు, సరీసృపాలు, దేవతలు, రాక్షసులు, నరులు వీళ్లంతా నీ రూపాలే కానీ.. వాటి ఆవల ఉన్న అద్వితీయమైన పరబ్రహ్మ తత్వాన్ని దర్శించలేకోపోతున్నా

Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
 
కల్పాన్త ఏతదఖిలం జరరేణ గృష్ణన్ శేతే పుమాన్ స్వదృగనన్తసఖస్తదజ్కే | 
యన్నా భిసిన్ధురుహకాంచనలోకపద్మ- గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతో౭_స్మి తస్మై ||9

కల్పాంతంలో సమస్త సృష్టిని తనలో లయం చేసుకుని.. ఆదిశేషుని ఒడిలో పవళించి తిరిగి తన నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించే పరమాత్మా నీకు వందనం

త్వం నిత్యముక్త పరిశుద్ధవిబుద్ధ అత్మా కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః ! 
యద్భుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే॥ 10

నువ్వు నిత్య ముక్తుడవు, శుద్ధమైనవాడవు , ఆది పురుషుడవు, సమస్త దివ్య గుణాలు కలిగినవాడవు. త్రిగుణాలను, 3 లోకాలను అధీనంలో ఉంచుకున్నవాడవు. బుద్ధికి అతీతమై సాక్షిగా ఉన్నవాడివి..
 
యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతన్తి విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్ |
తదబ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్య- మానన్దమాత్రమవికారమహం ప్రపద్యే || 11

విద్య, అవిద్య అనే శక్తులకు మూలం నువ్వు. ఏకం నీవేస అనంతుడవు నీవే, సమస్త విశ్వానికి మూలం నీవే, ఆందరూపుడవు నీవే..అలాంటి ఓ బ్రహ్మాన్ నిన్ను శరణాగతి చేస్తున్నా

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మ- మాళీస్తథానుభజతః పురుషార్ధమూర్తేః | 
అప్యేవమర్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రవ వత్సకమనుగ్రహ కాతరో౭_స్మాన్ || 12

నీ పాదాలను సృశించడం కన్నా ఫలం ఏముంది...ఓ గోవు తన దూడను కాపాడుకున్నట్టు నీవు దీనులైన మమ్ముల్ని కాపాడుతున్నావు.  దయ తప్ప మరొకటి కానీ నీ అనుగ్రహమే అందుకు కారణం అని 12 వ శ్లోకానికి అర్థం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
TTD News: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
TTD News: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
Mass Jathara: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Oscar Academy: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
Vishwambhara Song Promo: మెగాస్టార్ విశ్వంభర 'రామ రామ' సాంగ్ ప్రోమో రిలీజ్ - గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!
మెగాస్టార్ విశ్వంభర 'రామ రామ' సాంగ్ ప్రోమో రిలీజ్ - గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!
Embed widget