News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Guru Purnima Wishes 2022 : గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

ఏబీపీ దేశం ప్రేక్షకులకు ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఏ రంగంలో అయినా నడిపించడానికి గురువు కావాలి. అలాంటి గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి.

FOLLOW US: 

మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి అందించారు. వేదాలను నాలుగు బాగాలుగా చేశాడు కాబట్టే వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసుని పుట్టిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. అందుకే దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సందర్భంగా మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...

Also Read: ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారెందుకు, మత్స్య కన్యకి పుట్టిన వ్యాసుడు ఆదిగురువెలా అయ్యాడు!

1. గురు ప్రార్ధన
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!
విష్ణు రూపుడైన వ్యాసునకు, వ్యాస రూపుడైన విష్ణువుకు నమస్కారం. హ్మ విద్యానిలయుండై శ్రీవాసిష్టుడనబడే వ్యాస భగవానునికి నమస్కారం..
 
2. ​గురువు విశిష్టత
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: 

3.‘న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’
అంటే గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు
 
4. గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌
‘గు’ అంటే చీకటి.. ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు.
 
5. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః
అజ్ఞానమనే చీకటితో అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.  

6. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||
అఖండ ప్రపంచాన్ని ఆకాశం లా వ్యాపించిన ఏ గురుతత్వమైతే 'తత్ 'అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో,అట్టి శ్రీ గురువుకు నమస్కారము.

బ్రహ్మ  అందరినీ సృష్టిస్తారు -  గురువు మనలో మంచి గుణాన్ని పుట్టిస్తాడు 
విష్ణువు అందరినీ పోషిస్తాడు -  గురువు మనలో మంచి గుణాల్ని, మంచితనాన్ని పెంపొందిస్తాడు 
మహేశ్వరుడు అందరినీ లయము చేస్తాడు-  గురువు శివుని రూపంలో మనలోని చెడును దూరం చేస్తాడు
అందుకే గురువు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే ఎక్కువని అర్థం 

Also Read: గురు పౌర్ణమి రోజు ఈ రాశులవారు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు, జులై 13 బుధవారం రాశిఫలాలు

గురు సందేశం
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకెత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏంటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది. 

విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు ప్రత్యక్షమవుతాడు. మనలో నేర్చుకోవాలనే కుతూహలం కలిగితే చాలు.. తనకు వచ్చిన విజ్ఞానాన్నంతా నేర్పడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థుల మస్తిష్కంలో పుట్టే ఎన్నో అనుమానాలను తనవిగా భావించి ఏ ఫలమూ ఆశించకుండా వాటిని నివృత్తి చేస్తాడు -గౌతమ బుద్ధుడు

స్వపరభేదం లేనివాడు, ఏ భ్రాంతికి లోను కానివాడు, అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచేవాడు, ఏ పరిస్థితుల్లో మనోస్థ్యైర్యం కోల్పోక ఆత్మనిష్ఠతో ఉండేవాడే సద్గురువు. అలాంటి గురువుల బోధన విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది - రమణ మహర్షి 

గురువంటే సచ్చిదానంద స్వరూపం. తాను పారదర్శకంగా ఉంటూ.. తనలోని విజ్ఞానాన్ని శిష్యుల్లోకి పరిపూర్ణంగా ప్రసరింపజేసేవాడే నిజమైన గురువు. నీరు పల్లమెరిగినట్టుగా.. గురువులోని విజ్ఞానం శిష్యుడికి చేరాలి. ఇందులో ఎలాంటి సంశయాలకు తావుండకూడదు - రామకృష్ణ పరమహంస

నాకు అందరికంటే ఆత్మీయుడు గురువే. ఆ తర్వాతే అమ్మానాన్న. తండ్రి ‘ఇది చెయ్‌’ అని చెబుతాడు. అదే గురవైతే ఏం చేయకూడదో చెబుతాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు పునర్జన్మనిస్తాడు. అందుకే గురువుకే తొలివందనం అర్పిస్తాను - స్వామి వివేకానంద

పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించే గురవు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు. ఇలాంటి గొప్ప అవకాశం మరెవరికీ దక్కదు - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

సద్గురువు సాంగత్యంతోనే నిన్ను నీవు తెలుసుకోగలవు. ఎందుకంటే.. నిన్ను శిష్యుడిగా స్వీకరించిన క్షణంలోనే నీ గురించి ఆయనకు అవగతం అవుతుంది. నీలో మంచిని, చెడునూ గుర్తించగలడు. ఆ చెడును పారద్రోలి.. నిన్ను మంచివ్యక్తిగా మార్చగలిగేది గురువే - జిడ్డు కృష్ణమూర్తి

ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతోందంటే.. అతడికి సద్గురువు సాక్ష్యాత్కారం లభించలేదని అర్థం చేసుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడి అనుగ్రహం పొందిన వాడు గమ్యం దిశగా సాగిపోతుంటాడు. లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు - ఓషో

Also Read: జులై 13 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయకుడి 32 పేర్లు మీకోసం

Published at : 13 Jul 2022 06:47 AM (IST) Tags: mahabharat Guru Purnima 2022 Guru Purnima 2022 Date vyasa bhishma Guru Purnima Wishes 2022

సంబంధిత కథనాలు

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య  ఎలా రియాక్టయ్యాడు!

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Horoscope Today 18 August 2022:   ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?