రెండు గ్రహణాలు, పితృపక్షం.. గర్భిణులు ఈ 15 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Eclipse 2025: గర్భిణీ స్త్రీలకు సెప్టెంబర్ 7 నుంచి 21 వరకు ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు వారాల్లోనే పితృ పక్షం, సూర్య, చంద్ర గ్రహణాలు ఉన్నాయి.

Solar and Lunar Eclipses Worldwide 2025: గర్భధారణ సమయంలో మహిళలు తొమ్మిది నెలల పాటూ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో గ్రహణాలు ఏమైనా వచ్చినప్పుడు ఆ కిరణాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. చంద్రగ్రహణం, పితృపక్షం, సూర్య గ్రహణం.. ఈ 15 రోజులు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయం చాలా సున్నితమైనది అని చెబుతారు.
సెప్టెంబర్ 7 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం
సెప్టెంబర్ 07 to సెప్టెంబర్ 21 పితృపక్షం (Pitru Paksha 2025)
సెప్టెంబర్ 21 అమావాస్య ఆదివారం సూర్య గ్రహణం (Surya Grahan)
ఈ 15 రోజులు గర్భిణిలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుందని చెబుతారు. భాద్రపద పూర్ణిమ నుంచి భాద్రపత అమావాస్య వరకూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి...అనుసరించాలి.
పితృ పక్షం 15 రోజుల పాటూ గర్భిణీ స్త్రీలు కర్మకాండలకు దూరంగా ఉండాలి
గర్భిణీ స్త్రీలు ఆ ఆహారం కూడా తినకూడదు..సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి
పెద్దలకు తర్పణాలు విడుస్తారు..ఈ రోజు బ్రాహ్మణులకుభోజనం పెడతారు..ఇది కూడా గర్భిణిలు తినకూడదని చెబుతారు
ఒక పక్షంలో (15 రోజులు) రెండు గ్రహణాలు ఏర్పడటం జ్యోతిష్యం, మతపరంగా మంచిది కాదు. దీనివల్ల తీవ్రమైన ప్రభావం ఉంటుందని కాదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో ఆ కిరణాలు పడకుండా జాగ్రత్తవహించాలి. బయట తిరగకూడదు. కదలకుండా పడుకోవాలి అనే నియమాలు పాటించాల్సిన అవసరం లేదుకానీ.. ఓ రూమ్ లోనే జాగ్రత్తగా ఉండి.. గ్రహణం తర్వాత స్నానం ఆచరించాలి. ఇంకా పెద్దలు ఏం చెబుతారంటే..
గ్రహణం చూడకూడదు
గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా చూడకూడదని చెబుతారు, ఎందుకంటే ఇది గర్భంలోని శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
ఇంట్లోనే ఉండాలి
గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంటి లోపల, చీకటి గదిలో ఉండాలని చెబుతారుృ. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
పదునైన వస్తువులను ఉపయోగించకూడదు
కత్తులు, సూదులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించడం మానాలని, ఇవి శిశువుకు హాని కలిగించవచ్చని నమ్ముతారు.
ఆహారం తీసుకోకూడదు
గ్రహణ సమయంలో ఆహారం తినడం లేదా వంట చేయడం కూడదు. గ్రహణం సమయంలో ఆహారం "అపవిత్రం" అవుతుందని నమ్మకం.
మానసిక శాంతి
గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ధ్యానం లేదా ప్రార్థనలు చేయమని చెబుతారు.
శాస్త్రీయ దృక్పథం
శాస్త్రీయంగా, గ్రహణం అనేది సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క స్థానాల వల్ల సంభవించే సహజ ఖగోళ సంఘటన. గర్భిణీ స్త్రీలపై గ్రహణం యొక్క ప్రత్యక్ష ప్రభావం గురించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మీ కుటుంబం లేదా సమాజంలో సాంప్రదాయ నమ్మకాలు ముఖ్యమైనవి .. వాటిని గౌరవించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. అనవసర ఆందోళన కలిగినప్పుడు గర్భిణిలు వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.






















