అన్వేషించండి

vinayaka chavithi 2022: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు!

vinayaka chavithi 2022: వినాయకుడి ఆలయాలకు వెళ్లినవారు, వినాయక పూజలు నిర్వహించేవారు పూజ అనంతరం గుంజీలు తీస్తుంటారు. అలా గుంజీలు తీస్తే మంచిదని చెబుతారు. ఇంతకీ గుంజీల వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసా!

vinayaka chavithi 2022: వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు.  శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద సహా ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. 

Also Read: పార్వతీదేవి వినాయకుడిని దేనితో తయారు చేసింది, ఏనుగు ముఖం పెట్టకముందు వినాయకుడి రూపం ఇదే!

కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో అనుకుంటూ వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాలగణేషుడు ఏం వెతుకున్నావ్ అని అడిగితే.. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరిచిపోయాను..దానినే వెతుకుతున్నా అని సమాధానం చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బాలగణేషుడు నవ్వుతూ.. నేను మింగేశానుకదా అంటాడు. తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని మహావిష్ణువు బతిమలాడతాడు. అప్పుడు బాలుడిని ప్రశన్నం చేసుకునేందుకు మహావిష్ణువు..తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పటి నుంచీ వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేర్చేస్తాడని భక్తుల విశ్వాసం. 

Also Read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది, ఈ రోజున తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!

మట్టివినాయకుడినే వినియోగించండి
గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించాలి. ఎందుకంటే వాగులు, నదులు, కాలువలు సహా జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు నీటిలో చేరి కాలుష్యం తగ్గుతుంది. అందుకే మట్టి గణపతిని వినియోగించండి..ప్రకృతిని కాపాడండి..

సిద్ధి వినాయక స్తోత్రం (Siddhi Vinayaka Stotram in Telugu)

విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||

పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
-ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః
సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ
స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

యజ్ఞోపవీతపదలంభితనాగరాజో
మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః |
సర్వత్ర మంగలకరస్మరణప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ కుమారబంధో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

ఇతి శ్రీముద్గలపురాణే శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం |
ఇతి  శ్రీ సిద్ధి వినాయకార్పణమస్తు ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.