అన్వేషించండి

Ekadashi Dates : 2026లో ఏకాదశి తేదీలు, విశిష్టత & ఈ 2 ప్రత్యేక ఏకాదశిలు మిస్సవ్వకండి!

ఏకాదశి 2026 తేదీలు: ఏకాదశి వ్రతం విష్ణువు అనుగ్రహం కోసం, పునర్జన్మ నుండి విముక్తి కోసం. 2026లో ఏకాదశి వ్రతాల పూర్తి జాబితా.

Ekadashi 2026:  ఏకాదశి 2026 తేదీల జాబితా: ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణ పక్ష ఏకాదశి నెలకు రెండు వస్తాయి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన తిథి ఏకాదశి. అందుకే 24 ఏకాదశిలు దేనికవే ప్రత్యేకం. 2026లో ఏకాదశి పూర్తి జాబితా ఇదిగో..
 
ఏకాదశి 2026 జాబితా

షట్తిలా ఏకాదశి- 14 జనవరి 2026

జయా ఏకాదశి - 29 జనవరి 2026

విజయా ఏకాదశి - 13 ఫిబ్రవరి 2026

ఆమలకి ఏకాదశి - 27 ఫిబ్రవరి 2026

పాపమోచని ఏకాదశి - 15 మార్చి 2026

కామదా ఏకాదశి - 29 మార్చి 2026

వరుథిని ఏకాదశి - 13 ఏప్రిల్ 2026

మోహిని ఏకాదశి - 27 ఏప్రిల్ 2026

అపరా ఏకాదశి - 13 మే 2026

పద్మిని ఏకాదశి - 27 మే 2026

పరమ ఏకాదశి - 11 జూన్ 2026

నిర్జల ఏకాదశి - 25 జూన్ 2026

యోగినీ ఏకాదశి - 10 జూలై 2026

దేవశయని ఏకాదశి - 25 జూలై 2026

కామికా ఏకాదశి - 9 ఆగస్టు 2026

శ్రావణ పుత్రదా ఏకాదశి - 23 ఆగస్టు 2026

అజా ఏకాదశి - 7 సెప్టెంబర్ 2026

పరివర్తిని ఏకాదశి - 22 సెప్టెంబర్ 2026

ఇందిరా ఏకాదశి - 6 అక్టోబర్ 2026

పాపాంకుశ ఏకాదశి - 22 అక్టోబర్ 2026

రమా ఏకాదశి - 5 నవంబర్ 2026

దేవుత్థాన ఏకాదశి - 20 నవంబర్ 2026

ఉత్పన్న ఏకాదశి - 4 డిసెంబర్ 2026

మోక్షదా ఏకాదశి - 20 డిసెంబర్ 2026

2026లో 2 ప్రత్యేక ఏకాదశిలు

2026లో అధిక మాసం కూడా వస్తుంది, అందుకే ఈ నెలలోని 2 ఏకాదశిలు చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. వీటిని పరమ , పద్మిని ఏకాదశి అని పిలుస్తారు. పరమ అరుదైన శక్తులను ఇచ్చేది కాబట్టి పరమ అని పిలుస్తారు. అదే సమయంలో, పద్మిని ఏకాదశి వ్రతాన్ని క్రమబద్ధంగా పాటించేవారు విష్ణు లోకానికి వెళతా అన్ని రకాల యజ్ఞాలు, వ్రతాలు , తపస్సుల ఫలాలను పొందుతారని విశ్వాసం. 

ఏకాదశి వ్రతం  ప్రాముఖ్యత

ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది, పాపాలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది. ఈ వ్రతం శారీరక  మానసిక శుద్ధితో పాటు, మనస్సును పదును పెడుతుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఏకాదశి నాడు  నారాయణుడు ఎక్కువ శక్తితో ఉంటాడని..అందుకే ఈ రోజు ఆయన్ని ఆరాధించడం వల్ల కలిగే పుణ్యఫలం ఇతర వ్రతాల కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి

పద్మ పురాణం ప్రకారం ఏకాదశి వ్రతం వల్ల జన్మజన్మాంతరాల పాపాలు క్షయమవుతాయి.

ఈ వ్రతాన్ని 24 లేదా 26 ఏకాదశులు ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

చంద్రకళల సిద్ధాంతం ప్రకారం ఏకాదశి తిథినాడు శరీరంలో నీటి అంశం ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి, శరీరం డీటాక్స్ అవుతుంది.

పురాణ కథలు  భీష్మ పితామహుడు యుధిష్ఠిరునికి ఏకాదశి మాహాత్మ్యాన్ని వివరించాడు..వీటిలో అమలకీ ఏకాదశి, నిర్జలా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి  మరింత ప్రాధాన్యత కలిగినవి.

ఏకాదశి వ్రత నియమాలు 

దశమి నాడు రాత్రి నుంచే ఉపవాసం మొదలు (ఒకపూట భోజనం మాత్రమే).

ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం లేదా ఫలహారం (నిరాహారం - నీళ్లు కూడా తాగకపోవడం ఉత్తమం - నిర్జలా ఏకాదశి).

ధాన్యాలు, ఉప్పు, బియ్యం, గోధుమలు తినకూడదు.

ద్వాదశి నాడు పారాయణం చేసిన తర్వాత వ్రతం విరమించాలి

"ఏకాదశీ వ్రతం సర్వపాపహారి, సర్వసౌఖ్యప్రదం, మోక్షదాయకం" 

ఇక తిరుమల శ్రీవారికి ఏ ఏ సేవలున్నాయి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా! ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Advertisement

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Embed widget