అన్వేషించండి

Dussehra 2023 : అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే వచ్చే ఫలితం ఇదే!

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. 

అక్టోబరు 17 మంగళవారం - ఆశ్వయుజ శుద్ధ తదియ - ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకారం

 Sri Annapurna devi Alamkaram : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. నవరాత్రి వేడుకల్లో ఈరోజు ( మంగళవారం) అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తోంది. ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందిస్తుంది అన్నపూర్ణమ్మ. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి.  అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఏది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని చెబుతారు. 

Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కనకదుర్గమ్మ..ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తోంది. ఈ రోజు అమ్మను పూజించి చదవాల్సిన అష్టకం ఇదే..

శ్రీ అన్నపూర్ణేశ్వరీ  అష్టకం (Sri Annapurna Ashtakam )

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||1 ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.

దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. 

Also Read : శరన్నవరాత్రుల్లో పూజించాల్సిన నవదుర్గ అలంకారాలివే!

టాప్ హెడ్ లైన్స్

శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Embed widget