అన్వేషించండి

చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!

Chanakya Niti In Telugu: ఎంత కష్టపడినా విజయం దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు, చాణక్యుని ఆలోచనలు మీ ఆలోచనా విధానాన్ని మార్చి, మీకు మళ్ళీ విజయ మార్గాన్ని చూపిస్తాయి..ముఖ్యంగా జెన్ జీలకు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కష్టంతో పాటు తెలివితేటలు, ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవాలి.
  • వైఫల్యాన్ని స్వీకరించి, గౌరవం లేని చోట ఉండవద్దు.
  • అదృష్టం నమ్మకుండా, మీ చేతలతో ధైర్యంగా ముందుకు సాగండి.

Chanakya Niti: ఎంత కష్టపడుతున్నా మీరు ఆశించిన ఫలితం రావడం లేదా? ఓటమి అంటే భయపడుతున్నారా? ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా? ఇంటా బయటా గౌరవం తగ్గిందా?.. వీటికి కారణం మీరు అనుసరించే విధానాలే అని చెప్పారు ఆచార్య చాణక్యుడు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది, అపజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎలా ముందుకు సాగాలో అర్థమవుతుందని నీతిశాస్త్రంలో బోధించారు చాణక్యుడు. ముఖ్యంగా ఈ ఆరు లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. 

కష్టపడటం అవశ్యకం, కానీ వివేకం కూడా అంతే అవసరం

విజయం సాధించడానికి ప్రతిఒక్కరూ రేయింబవళ్లు కష్టపడతారు, సమయం మొత్తాన్ని సక్సెస్ కోసం కేటాయించేశాం అనుకుంటారు... కానీ కేవలం కష్టపడటం మాత్రమే సరిపోదు. సరైన దిశానిర్దేశం లేకుండా అడుగువేస్తే...ఆ కష్టానికి ప్రతిఫలం ఉండదు. విజయం సాధించాలంటే కేవలం కష్టం మాత్రమే కాదు... తెలివితేటలు, సహనం, సరైన ప్రణాళిక కూడా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
 
ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోండి

మీరు చేసే తప్పుల నుంచి మాత్రమే కాదు.. ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకున్నవారే జీవితంలో పురోగతి సాధించగలరని చాణక్యుడు విశ్వసించారు.  నా వరకూ వస్తే చూద్దాంలే అనే ఆలోనచ  కన్నా..అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తపడాల్సిందే. అందుకే  ఇతరుల వైఫల్యాల నుంచి నేర్చుకుంటే, అవే తప్పులను పునరావృతం చేయకుండా ఉండి, మరింత త్వరగా విజయాన్ని సాధించగలం.

చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!

వైఫల్యానికి భయపడకండి, దాన్ని స్వీకరించండి

జీవితంలో వైఫల్యం సహజం. ప్రతి అడుగులోనూ మంచే జరగాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ...కొన్నసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే  కొన్నిసార్లు ఓటమి మనకు గెలవడానికి సరైన మార్గాన్ని నేర్పుతుంది. గతాన్ని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకుండా... వచ్చేసారికి మరింత మెరుగ్గా సిద్ధపడాలని చాణక్యుడు చెబుతాడు. ఇదే నిజమైన ఎదుగుదల.
 
గౌరవం లభించని చోట ఉండవద్దు

గౌరవం లభించని చోట ఎవరూ ఉండకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. గౌరవం కోల్పోయిన తర్వాత అక్కడ మీరు ఏం సాధించినా గుర్తింపు ఉండదు.. ఆ విజయానికి అర్థం ఉండదు. అందుకే విజయం కన్నా ముందు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి... ఆత్మగౌరవం కంటే గొప్పది ఏదీ లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే, విజయం దానంతట అదే వస్తుంది.

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

మీ అదృష్టాన్ని కాదు, మీ చేతలను నమ్మండి

అదృష్టం మీద ఆధారపడటం సులభం, కానీ చాణక్యుని ప్రకారం.. కృషి చేసేవారికే నిజమైన విజయం లభిస్తుంది. కఠోర శ్రమ, అంకితభావం మాత్రమే విధిని సైతం మార్చగల శక్తులు. అందువల్ల, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, మీ లక్ష్యంపై దృష్టిని కోల్పోకండి.
 
గొప్ప లక్ష్యాలకు అపారమైన ధైర్యం కావాలి

చాణక్యుడు చెప్పినట్లుగా, "లక్ష్యం ఎంత పెద్దదైతే, సవాలు అంత గొప్పగా ఉంటుంది." కాబట్టి, మీకు పెద్ద కలలు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తే నిజమైన విజేత.

Frequently Asked Questions

చాణక్య నీతి ప్రకారం విజయం సాధించడానికి కష్టపడటం మాత్రమే సరిపోతుందా?

కాదు, కేవలం కష్టపడటం సరిపోదు. తెలివితేటలు, సహనం, సరైన ప్రణాళిక కూడా విజయానికి అవసరం అని చాణక్యుడు చెప్పారు.

జీవితంలో పురోగతి సాధించాలంటే ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?

మన తప్పుల నుంచే కాకుండా, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఇది అవే తప్పులు చేయకుండా త్వరగా విజయాన్ని సాధించడానికి సహాయపడుతుంది.

వైఫల్యం గురించి ఆచార్య చాణక్యుడు ఏమని చెప్పారు?

వైఫల్యానికి భయపడకుండా దాన్ని స్వీకరించాలి. కొన్నిసార్లు ఓటమి మనకు గెలవడానికి సరైన మార్గాన్ని నేర్పుతుంది, అది నిజమైన ఎదుగుదల.

గౌరవం లభించని చోట ఉండడం గురించి చాణక్యుడు ఏమని సూచించారు?

గౌరవం లభించని చోట ఎవరూ ఉండకూడదు. అక్కడ ఏం సాధించినా గుర్తింపు ఉండదు, ఆ విజయానికి అర్థం ఉండదు. ఆత్మగౌరవమే ముఖ్యం.

విజయం కోసం అదృష్టంపై ఆధారపడాలా?

అదృష్టంపై కాకుండా, మీ కృషి, కఠోర శ్రమ, అంకితభావంపై నమ్మకం ఉంచాలి. ఇవి విధిని సైతం మార్చగల శక్తులని చాణక్యుడు చెప్పారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget