అన్వేషించండి

చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!

Chanakya Niti In Telugu:  ఎవర్ని ఇగ్నోర్ చేయాలి? ఏ సమయంలో ఇగ్నోర్ చేయాలి? ఎందుకు ఇగ్నోర్ చేయాలి? వీటికి సరైన సమధానాలు చాణక్యనీతి శాస్త్రంలో ఉన్నాయ్.. మీరు నేర్చుకోండి ఉపయోగపడుతుంది

Chanakya Niti:  ఆచార్య చాణక్యుడు తన శిష్యులకు బోధించిన విషయాలు తరాలు గడిచినా అనుసరించేవిగా ఉంటాయి. అలాంటివాటిలో ఒకటి ఇగ్నోర్ చేయడం.. 

ఎవర్ని ఇగ్నోర్ చేయాలి?

ఏ సమయంలో ఇగ్నోర్ చేయాలి?

ఎందుకు ఇగ్నోర్ చేయాలి?

ఎవరికి ఓ ఛాన్స్ ఇవ్వాలి?

ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎందుకు బోధించారు?
 
ఇగ్నోర్ చేయడం అంటే.. మౌనంగా ఉండడం లేదా పట్టించుకోనట్టు వ్యవహరించడం. ఇది చాలా శక్తివంతమైన ఆయుధం అని తన నీతిశాస్త్రంలో 
వివరించారు ఆచార్య చాణక్యుడు. 

చాణక్యుడు సూత్రీకరించిన రాజనీతి, యుద్ధనీతిని వ్యక్తిగత జీవితంలోనూ వాడుకోవచ్చు. 
 
చాణక్యనీతిలో ఇగ్నోర్ గురించి చెబుతూ ఓ శ్లోకం ఉంది

"యస్య న జాయతే క్రోధః సర్వసిద్ధిః స ఉచ్యతే"

ఎవరైతే కోపాన్ని బయటకు ప్రదర్శించరో వారు అన్నీ సాధించినవారు అవుతారు. అంటే కోపం, బాధ, అవమానం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండడం ఓ ఆయుధం. 

ఇగ్నోర్ చేయడం ఎందుకు ఆయుధం అవుతుంది?

మౌనంగా ఉండడం అంటే శత్రువుని బలహీనంగా మార్చేయడమే. ఎందుకంటే మీరు రియాక్టైతే వారికి ఆనందం..అదే మీరు సైలెంట్ గా ఉండిపోతే వారు నీపై ఏ ప్రభావం చూపించలేకపోయారనే భయం మొదలవుతుంది

నీ శక్తిని నువ్వు కాపాడుకున్నట్టే
 
చులుకనగా మాట్లాడేవాళ్లకు, నీ మంచితనాన్ని నీ కష్టాన్ని అర్థం చేసుకోనివారికోసం సమయం వృథా చేయకుండా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెడితే చాలు..నీ శక్తిని నువ్వు కాపాడుకున్నట్టే...అప్పుడే కదా మంచి ఫలితాలు సాధించగలరు..
 
మనస్తాపం తగ్గుతుంది
 
ప్రతి చిన్న విషయానికి ఎప్పుడైతే అతిగా స్పందిస్తారో అలాంటి వారి మనసు ఎప్పుడూ కలవరంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం నేర్చుకుంటారో అప్పుడు మీ మనశ్సాంతికి భంగం కలిగించేవారు ఎవ్వరూ ఉండరు. అంటే మనస్తాపానికి మీకు అవకాశం ఇవ్వడంలేనట్టే కదా..
 
మీకు మీరే రాజు మంత్రి
 
సింహం సింగిల్ గా వస్తుంది..కుక్కలే గుంపుగా మొరుగుతాయ్ అనే డైలాగ్ సినిమాల్లో ఉంటుంది. అయితే ఇదే విషయం చాణక్య నీతిలోనూ ఉంది. గుంపుగా మొరిగే కుక్కల్ని సింహం పట్టించుకోదు..వాటికి సమాధానం చెప్పదు..జస్ట్ ఇగ్నోర్ చేసి రాజసంగా తన దారిలో తాను వెళ్లిపోతుంది అంతే..
 
ఎవర్ని ఇగ్నోర్ చేయాలి?

@ మిమ్మల్ని చులకగా మాట్లాడేవారిని ఇగ్నోర్ చేయండి....ఎందుకంటే వాడి స్థాయి నీకన్నా తక్కువ
 
@ మీ విజయాన్ని చూసి జీర్ణించుకోలేనివాళ్లను ఇగ్నోర్ చేయండి... ఎందుకంటే వాళ్లు ఓడిపోయారు , పట్టించుకోవడం అనవసరం
 
@ నీ కష్టాన్ని అర్థం చేసుకోని వారిని ఇగ్నోర్ చేసేముందు ఓ అవకాశం ఇచ్చి చూడండి.. మొదట్లో అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటారేమో చూడండి. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోకుండా ఇంకా హద్దు దాటితే వారిని ఇగ్నోర్ చేయండి
 
@ మీ గౌరవానికి, భద్రతకు హాని కలిగించే వ్యక్తులను ఇగ్నోర్ చేయండి..ఇలాంటి వారి విషయంలో అస్సలు మరో ఆలోచన ఉండకూడదు
 
 శత్రువు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మౌనంగా నవ్వు - అదే వారికి అతి పెద్ద శిక్ష
 
తక్కువ మాట్లాడగలిగినప్పుడే నువ్వు ఎక్కువ ఆలోచించగలవని గుర్తుపెట్టుకో
 
మూర్ఖుడు మాటలతో కాదు మౌనంతో ఓడిపోతాడు.. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావంటే నువ్వు బలహీనుడికి అని కాదు.. అజేయుడివి అని అర్థం. 

అయితే ఇగ్నోర్ చేయడం అనే ఆయుధాన్ని  ఏ సమయంలో వాడాలో కూడా సరిగ్గా తెలుసుకోవాలి..లేదంటే బంధాలు ముగిసిపోతాయ్ 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget