News
News
వీడియోలు ఆటలు
X

Dussehra 2021: శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు చదువులతల్లి అలంకారం, జ్ఞాన ప్రదాతగా సరస్వతి గురించి ప్రచారంలో ఉన్న పురాణకథలివే..

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజున అమ్మను కొలిస్తే విద్యార్ధులకు జ్ఞానసంపద కలుగుతుందని భక్తుల విశ్వాసం...

FOLLOW US: 
Share:

ప్రణోదేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ ధీనా మవిత్రయవతు
హిందువుల ముఖ్యమైన దేవతా మూర్తుల్లో సరస్వతి దేవి ఒకరు.  త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాల్లో సరస్వతీ నది  ప్రస్తావన ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన జరుగుతుంది.  ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతం,  బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణంలో సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. బ్రహ్మ సకల సృష్టి కర్త కావడంతో సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించేందుకు బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని చెబుతారు. పరాశక్తి ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆమె కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని  దేవీ భాగవతంలో ఉంది . వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం  వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. హంసవాహినిగా ,  పుస్తకం మాలా ధారిణిగా శ్వేతవర్ణంలో కనిపించే అమ్మవారి చేతిలో ఉండే వీణపేరు కచ్చపి. 
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
జ్ఞాన ప్రదాతగా సరస్వతి గురించి ప్రచారంలో ఉన్న గాథలు
-పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమంటే బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞాన సిద్థాంతాన్ని సనత్కుమారుడికి చెప్పాడు
-భూదేవి జ్ఞానాన్ని ఉపదేశించమని అనంతుడిని అడగగా..కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించిన అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని చెప్పాడట.
-చదువులతల్లిని స్తుతించిన తర్వాతే వాల్మీకి పురాణసూత్ర జ్ఞానాన్ని సముపార్జించాడు
-వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర  తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని  పొంది  ఆ తర్వాతే  ఆయన వేద విభాగాన్ని , పురాణ రచన చేశాడు.
-సరస్వతి శక్తి ప్రభావంతో శివుడు..ఇంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు
-గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా మరిచిపోయిన యాజ్ఞవల్క్య మహర్షి..సూర్యుడి గురించి తపస్సు చేస్తాడు. సరస్వతీ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జ్ఞాపకశక్తి తిరిగి వస్తుందని సూర్యుడు చెప్పడంతో ...ఆ స్తుతి చేసి గురుశాపం నుంచి విముక్తి పొందాడు. 
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో  మూలా నక్షత్రం రోజు  అమ్మవారిని శ్రీసరస్వతిదేవిగా ఆలంకరిస్తారు. మూలా నక్షత్రం చదువులతల్లి జన్మనక్షత్రం.  సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి.  సరస్వతీ అలంకారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తుల విశ్వాసం.
Alos Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Oct 2021 08:01 AM (IST) Tags: Dussehra 2021 Saraswati Alakaram Sharanavaratri celebrations

సంబంధిత కథనాలు

Bhagavad Gita: ఈ 4 పనులు చేస్తేనే మానసిక ప్రశాంతత సాధ్యం..!

Bhagavad Gita: ఈ 4 పనులు చేస్తేనే మానసిక ప్రశాంతత సాధ్యం..!

జూన్ 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు!

జూన్ 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు!

వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

shakuna shastra: శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

shakuna shastra: శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!