By: ABP Desam | Updated at : 20 Jun 2023 06:00 AM (IST)
ఆషాఢంలో ఈ 3 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే..! (Representational Image/freepik)
Ashada Maasa 2023 Do's: హిందూ పంచాంగం ప్రకారం, తెలుగు నెలల్లో నాలుగవది అయిన ఆషాడమాసం శనివారం (జూన్ 19) నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వీలైనంత ఎక్కువ నీటిని పొదుపు చేయాలని పెద్దలు చెప్పారు. ఈ మాసంలో స్వచ్ఛమైన నీటిని తాగాలి. ఎందుకంటే ఈ మాసంలో కురిసే వర్షాల వల్ల నీటి వనరులు పెరుగుతాయి, దీని కారణంగా అనేక నీటి సంబంధిత వ్యాధులు ప్రబలడం ప్రారంభిస్తాయి. మతపరమైన దృక్కోణంలో ఆషాఢ మాసం విష్ణువు, సూర్యుడు, దుర్గాదేవికి ఇష్టమైన మాసంగా భావిస్తారు.
ఈ నెలను కోరికలు నెరవేరే నెల అని కూడా అంటారు. ఆషాఢమాసంలో ఇక్కడ చెప్పిన ఈ 3 పనులు చేయడం వల్ల మనిషికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది. అదే సమయంలో చాతుర్మాసం కూడా ఆషాఢమాసంలో ప్రారంభమవుతుంది. చాతుర్మాసం ప్రారంభం కావడంతో అన్ని రకాల శుభకార్యాలు ఆగిపోతాయి. ఆషాడ మాసంలో మనం ఏ 3 పనులు చేస్తే శుభప్రదమో తెలుసుకుందాం.
1. ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని ఎందుకు అంటారు..?
ఆషాఢ మాసానికి ఉత్తరాషాఢ నక్షత్రం అని కూడా పేరు. మరోవైపు, హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెల పౌర్ణమి రోజు చంద్రుడు ఉన్న నక్షత్రం పేరు పెట్టారు. ఈ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడం వల్ల ఆషాఢ మాసం అంటారు.
2. ఆషాఢమాసంలో ఈ మూడు పనులు చేస్తే అదృష్టం
- ఆషాఢ మాసాన్ని కోరికలు నెరవేరే మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణువును పూజించండి. విష్ణువును ఎంత పూజిస్తే అంత లాభాలు కలుగుతాయి.
- ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు జలదేవతను పూజించాలి. ఇది సంపదతో పాటు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ మాసంలో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలో ఎప్పటికీ సమస్యలు తలెత్తవు.
- ఆషాడమాసంలో దుర్గాదేవిని పూజించడం కూడా చాలా శ్రేయస్కరం. ఈ సమయంలో దుర్గాదేవిని పూజించడం వల్ల మనకు మంచి, శుభ ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
3. ఆషాఢ మాసం అశుభమా..?
భారతీయులు ఈ మాసాన్ని అత్యంత అశుభకరమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో భారతీయులు శుభకార్యాలు చేయరు. అంతేకాకుండా అత్తగారు, కొత్త కోడలు ఒకే ఇంట్లో ఉండరు. దీని వెనుక కారణం ఏమిటి..?
- ఆషాఢ మాసంలో అధిక వర్షాల కారణంగా వివాహం వంటి శుభకార్యాలు నిషిద్ధం.
- ఆషాఢ మాసం ముగిసి కొత్త మాసం మొదలయ్యే వరకు కొత్తగా పెళ్లయిన కూతురు తన భర్త ఇంటిని వదిలి తన పుట్టింటికి వెళ్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఈ మాసంలో భార్యాభర్తలు కలిస్తే అశుభం, అయితే ఈ మాసంలో అత్తగారు, కోడలు ఒకే ఇంట్లో ఉంటే వారి మధ్య మనస్పర్థలు వస్తాయని పెద్దలు అంటారు.
Also Read : దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయడం నిషేధించినప్పటికీ, భగవంతుని పూజించడంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఆషాడమాసంలో భగవంతుడిని పూజిస్తే రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!
Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !
Horoscope Today December 1st, 2023: డిసెంబరు మొదటి రోజు రాశిఫలాలు
Astrology:ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>