News
News
X

Diwali Lakshmi Pooja: దీపావళి రోజు లక్ష్మీ పూజా ఇలా చేసుకోండి…

సంపద , శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీ దేవికి దీపావళి రోజు సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి వారికోసం ఏబీపీ దేశం అందిస్తోన్న పూజా విధానం. 

FOLLOW US: 

దీపం జ్యోతి పరబ్రహ్మమ్ , దీపం సర్వతమోహరమ్ , దీపేన సాధ్యతే సర్వమ్ , సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. ఈ రోజున ప్రతి లోగిలీ దీపాలతో వెలిగిపోతుంది.  వరాహస్వామికి - భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించిన నరకుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. దేవతలను వేధిస్తున్న నరకుడిని సంహరించిన రోజే నరకచతుర్థశి. ఆ ఆనందంలోనే జరపుకుంటున్నవే దీపావళి వేడుకలు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి  క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. సృష్టి ఆది నుంచి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీ దేవి తోడుగా ఉందని  పురాణాలు , ఇతిహాసాల్లో ప్రస్తావించారు.  ఓ సారి లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించిందట. భృగు మహర్షి కుమార్తె కావడంతో భార్గవి అనికూడా పిలుస్తారు. క్షీరసాగర మథనం నుంచి  ఇదే రోజు లక్ష్మీదేవి ఉద్భవించడంతో ఈరోజున లక్ష్మీఆరాధన చేసిన వారింట సిరులుపంట పండుతుందని విశ్వాసం.

దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి పూజలోనూ ముందు వినాయకుడిని ఆరాధిస్తాం. అందుకే పసుపు వినాయకుడికి ముందుగా పూజ చేసి లక్ష్మీపూజ చేసుకోవాలి. పూర్తిస్థాయిలో పూజ చేయలేని వారు పసుపు వినాయకుడిని చేసి శుక్లాంబరధరం చదివి ధూపం, నైవేద్యం, హారతి ఇచ్చినా సరిపోతుంది. 
పసుపు గణపతి పూజ
శ్లోకం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.
ఆచమనీయం
ఓం కేశవాయ స్వాహా,  ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా ,ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః ,ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం హ్రిషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః , ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః , ఓం అనిరుద్ధాయ నమః ,ఓం పురుషోత్తమాయ నమః , ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః.
గణపతికి నమస్కరించి
యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
ఈ మంత్రం చెపుతూ దేవుడిపై అక్షింతలు వేయాలి.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

(క్రింది విధముగా చదువుతూ అక్షింతలు వాసన చూసి వెనుక వేసుకోవాలి)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే. (ప్రాణాయామం) ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ || ||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లాలి.

సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ( మీరు దగ్గరగా ఉన్న నదిని చెప్పుకోండి) నదీ సమీపే. నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం, భృగవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్ ( ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకోవాలి)

ఆధౌ నిర్వఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే...తదంగ కలశారాధనం కరిష్యే అని చెప్పి కలశ జలంలోగంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`
( కలశలో నీటిని మీపై, పూజా ద్రవ్యాలపై చల్లాలి)
పసుపు గణపతిపై అక్షింతలు వేస్తూ చదవాలి
ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్. శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి . శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి.

నైవేద్యం
ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి. ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.

శ్రీ మహాగణాధిపతియే నమః తాంబులం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
పూజ చేసిన అక్షింతలు, పూలు తలపై వేసుకుని
శ్లో : యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.
ఉద్వాసన
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

ఇక్కడి వరకూ పసుపు గణపతి పూజ.. ఆ తర్వాత లక్ష్మీపూజ ప్రారంభించాలి.
లక్ష్మీదేవి పూజ
మళ్లీ ఆచమనీయం చేసి కేశవనామాలు చెప్పుకోవాలి. 
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ సూక్త విధనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే 

ధ్యానం 
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మ॒పత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా |
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మ॒ణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః |
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృ॒హే సర్వ॒మాంగళ్యయుక్తా||

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగంగాధరాం |
త్వాం త్రై॒లోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధ్యాయామి |
ఆవాహనం 
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చన్ద్రాం హి॒రణ్మయీం ల॒క్ష్మీం జాతవేదో మ॒ ఆవహ ||
ఓం సర్వలోకస్యజననీం శూలహస్తాం త్రిలోచనామ్ |
సర్వదేవమయీమీశాం దేవీమావాహయామ్యహమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆవాహయామి |
ఆసనం 
తాం మ ఆవహ॒జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ||
ఓం తప్తకాంచనవర్ణాభం ముక్తామణివిరాజితమ్ |
అమలం కమలం దివ్యమాసనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం
అశ్వ॒పూర్వాం ర॑థమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ |
శ్రియం దేవీముప॑హ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||
ఓం గంగాదితీర్థసమ్భూతం గంధపుష్పాక్షతైర్యుతమ్ |
పాద్యం దదామ్యహం దేవి గృహాణాశు నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం 
కాంసోస్మి॒తాం హిర॑ణ్యప్రాకారామార్ద్రాం
జ్వలన్తీం తృ॒ప్తాం తర్పయన్తీమ్ |
పద్మే॒ స్థితాం ప॒ద్మవర్ణాం తామిహోపహ్వయేశ్రియమ్ ||
అష్టగంధసమాయుక్తం స్వర్ణపాత్రప్రపూరితమ్ |
అర్ఘ్యం గృహాణ మద్దత్తం మహాలక్ష్మై నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం
చ॒న్ద్రాం ప్రభాసాం య॒శసా జ్వలన్తీం
శ్రియం లోకే దే॒వజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శర॑ణమహం ప్రప॑ద్యే
ల॒క్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ||
ఓం సర్వలోకస్య యా శక్తిః బ్రహ్మవిష్ణ్వాదిభిః స్తుతా |
దదామ్యాచమనం తస్యై మహాకాళ్యై మనోహరమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మహాలక్ష్మీదేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానం 
ఆ॒ది॒త్యవర్ణే॒ తప॒సోధిజాతో
వన॒స్పతిస్తవ వృ॒క్షోథ బి॒ల్వః |
తస్య ఫలాని తపసా నుదన్తు
మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మ॒హేరణాయ॒ చక్షసే |
యో వ: శి॒వతమో రసస్తస్య భాజయతే హ న: |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
ఓం పంచామృత సమాయుక్తం జాహ్నవీసలిలం శుభమ్ |
గృహాణ విశ్వజనని స్నానార్థం భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం 
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్
కీర్తిమృద్ధిం దదాతు మే ||
ఓం దివ్యాంబరం నూతనం హి క్షౌమంత్వతిమనోహరమ్ |
దీయమానం మయా దేవి గృహాణ జగదంబికే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మధుపర్కం 
కాపిలం దధి కున్దేన్దుధవలం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మధుపర్కం సమర్పయామి |
ఆభరణం
క్షుత్పిపాసామలాం జ్యే॒ష్ఠామలక్ష్మీం నాశయా॒మ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
ఓం రత్నకంకణ వైఢూర్య ముక్తాహారాదికాని చ |
సుప్రసన్నేన మనసా దత్తని స్వీకురుష్వ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం, చందనం, పసుపు, కుంకుమ, పూలు
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే॒ శ్రియమ్ ||
శ్రీఖండాగరుకర్పూర మృగనాభిసమన్వితమ్ |
విలేపనం గృహాణాశు నమోఽస్తు భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చందనం సమర్పయామి |
ఓం రక్తచందనసమ్మిశ్రం పారిజాత సముద్భవమ్ |
మయాదత్తం గృహాణాశు చందనం గంధసంయుతం ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః రక్తచందనం సమర్పయామి |
ఓం సిందూరం రక్తవర్ణం చ సిందూరతిలకప్రియే |
భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సిందూరం సమర్పయామి |
కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణమ్ |
అఖండ కామసౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః కుంకుమం సమర్పయామి |
ఓం తైలాని చ సుగంధీని ద్రవ్యాణి వివిధాని చ |
మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సుగంధి తైలం సమర్పయామి |
మనస: కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్ర॑యతాం యశ: ||
ఓం మందారపారిజాతాదీన్పాటలీం కేతకీం తథా |
మరువామోగరం చైవ గృహాణాశు నమోస్తు తే |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పాణి సమర్పయామి |
ఓం విష్ణ్వాదిసర్వదేవానాం ప్రియాం సర్వసుశోభనమ్ |
క్షీరసాగరసంభూతే దూర్వాం స్వీకురు సర్వదా ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దుర్వాః సమర్పయామి |

పూల మాల
క॒ర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతర పద్మమాలినీమ్ ||
ఓం పద్మశంఖజపాపుష్పైః శతపత్రైర్విచిత్రితామ్ |
పుష్పమాలాం ప్రయచ్ఛామి గృహాణ త్వం సురేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పమాలామ్ సమర్పయామి |

అథాంగ పూజా 
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి |
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి |
ఓం కమలాయై నమః – కటిం పూజయామి |
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి |
ఓం విశ్వవల్లభాయై నమః – వక్షస్స్థలం పూజయామి |
ఓం కమలవాసిన్యై నమః – నేత్రత్రయం పూజయామి |
ఓం శ్రియై నమః – శిరః పూజయామి |
ఓం మహాలక్ష్మై నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అథ పూర్వాదిక్రమేణాష్టదిక్ష్వష్టసిద్ధీః పూజయేత్ |
ఓం అణిమ్నే నమః | ఓం మహిమ్నే నమః |
ఓం గరిమ్ణే నమః | ఓం లఘిమ్నే నమః |
ఓం ప్రాప్త్యై నమః | ఓం ప్రాకామ్యాయై నమః |
ఓం ఈశితాయై నమః | ఓం వశితాయై నమః |

ధూపం 
ఆప: సృ॒జన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యస్సుమనోహరః |
ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధూపం సమర్పయామి |

దీపం
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గ॒లాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హి॒రణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం కర్పూరవర్తిసంయుక్తం ఘృతయుక్తం మనోహరమ్ |
తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దీపం సమర్పయామి |

నైవేద్యం 
ఆ॒ర్ద్రాం య॒: కరిణీం య॒ష్టిం సువర్ణాం హేమమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మయీం ల॒క్ష్మీం జాత॑వేదో మ ఆవహ ||
ఓం నైవేద్యం గృహ్యతాం దేవి భక్ష్యభోజ్యసమన్వితమ్ |
షడ్రసైరన్వితం దివ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః  నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువ: | తత్సవితుర్వరే”ణ్య॒మ్ | భర్గో॑ దేవస్య॑ ధీమహి |
ధియో యోన: ప్రచోదయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృ॒తోప॒స్తరణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉదానాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

శీతలం నిర్మలం తోయం కర్పూరేణ సువాసితమ్ |
ఆచమ్యతాం మమ జలం ప్రసీద త్వం మహేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆచమనీయం సమర్పయామి |

తాంబూలం
తాం మ ఆవహ జాతవేదో ల॒క్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం
గావో॑ దాస్యోశ్వా”న్వి॒న్దేయం పురుషాన॒హమ్ ||
ఓం ఏలాలవంగకర్పూరనాగపత్రాదిభిర్యుతమ్ |
పూగీఫలేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః తాంబూలం సమర్పయామి |

ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తస్మాత్ఫలప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఫలం సమర్పయామి |

ఓం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |
అనంతపుణ్యఫలదం అతః శాన్తిం ప్రయచ్ఛమే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దక్షిణాం సమర్పయామి |
నీరాజనం 
ఆనన్ద॒: కర్దమశ్చైవ చిక్లీత ఇతి॒ విశ్రుతాః |
ఋషయ: తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా ||
ఓం చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్ |
ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం
ఓం మహాదే॒వ్యై చవి॒ద్మహే విష్ణుప॒త్నీ చధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచో॒దయాత్ ||
ఓం కేతకీజాతికుసుమైర్మల్లికామాలతీభవైః |
పుష్పాంజలిర్మయాదత్తస్తవప్రీత్యై నమోఽస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు , అంక్షితలతో పూజ 
ఓం ప్రకృత్యై నమః    ఓం వికృత్యై నమః     ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః  ఓం భువనేశ్వర్యై నమః  ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః   ఓం సురభ్యై నమః   ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాలయాయై నమః  ఓం పద్మాశన్యే నమః  ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః   ఓం సుధాయై నమః  ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః  ఓం నిత్యపుష్టాయై నమః  ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై నమ:  ఓం దిత్యై నమః  ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః  ఓం వసుధారిణ్యై నమ:  ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః  ఓంకామాక్ష్యై నమః  ఓం క్రోధసముద్భవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః  ఓం బుద్ద్యై నమః  ఓం అనఘాయై నమః 
ఓం హరివల్లభాయై నమః  ఓం అశోకాయై నమః  ఓం అమృతాయై నమః 
ఓం దీప్తాయై నమః  ఓం లోకశోకవినాశిన్యై నమః  ఓం ధర్మనిలయాయై నమః 
ఓం కరుణాయై నమః  ఓం లోకమాత్రే నమః  ఓం పద్మప్రియాయై నమః 
ఓం పద్మహస్తాయై నమః  ఓం పద్మాక్ష్యై నమః  ఓం పద్మసుందర్యై నమః 
ఓం పద్మోద్భవాయై నమః  ఓం పద్మముఖ్యై నమః  ఓం పద్మనాభప్రియాయై నమః 
ఓం రమాయై నమః  ఓం పద్మమలాదరాయై నమః ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః  ఓం పద్మగంధిన్యై నమః  ఓం పుణ్యగంధిన్యే నమః
ఓం సుప్రసన్నయై నమః  ఓం ప్రసాదాభిముఖ్యై నమః  ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః  ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః  ఓం చంద్రరూపాయై నమః  ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః   ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః  ఓం శివకర్యై నమః  ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః  ఓం విశ్వజనన్యై నమః  ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః  ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః  ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః  ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః  ఓం ఉదారాగ్యై నమః  ఓం హేమమాలిన్యై నమః
ఓం హరిణ్యై నమః  ఓం ధనధాన్యకర్త్యై నమః  ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః  ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః  ఓం వసుప్రదాయై నమః  ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై/మంగళాయై నమః
ఓం దేవ్యై నమః  ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః  ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః  ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః  ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ప్రార్థనా
ఓం సురాసురేంద్రాదికిరీటమౌక్తికై-
-ర్యుక్తం సదా యత్తవపాద కంజనమ్ |
పరావరం పాతు వరం సుమంగళం
నమామి భక్త్యా తవ కామసిద్ధయే ||
భవాని త్వం మహాలక్ష్మి సర్వకామప్రదాయినీ |
సుపూజితా ప్రసన్నాస్యాన్మహాలక్ష్మై నమోఽస్తు తే ||
నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే |
యా గతిస్త్వత్ప్రపన్నానాం సా మే భూయాత్త్వదర్చనాత్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాలు
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

ప్రదక్షిణ : యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం : నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం | భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః | శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

క్షమా ప్రార్థన 
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మై సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాదం
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాలక్ష్మై నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |
(అమ్మవారి దగ్గర పూజ చేసిన పూలుతీసుకుని, అక్షతలు తలపై వేసుకోవాలి)

ఓం శాంతిః శాంతిః శాంతిః |

లక్ష్మీపూజ ఇలా మాత్రమే చేయాలి లేదు. ఎవరి శక్తికి తగ్గట్టు వారు నిర్వహించుకోవచ్చు. వినాయకుడికి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా చాలని చెబుతారు. విధానం కన్నా భక్తి ప్రధానం అన్నది గుర్తుంచుకోవాలి.
Also Read:  శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
Also Read:  ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:  ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: దీపావళి రోజున చీపురు కొంటే సిరిసంపదలు కలిసొస్తాయిట... దానం చేసినా చాలా మంచిదంటున్న పండితులు
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 09:26 AM (IST) Tags: Diwali Maha Lakshmi Pooja Process

సంబంధిత కథనాలు

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

టాప్ స్టోరీస్

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Satyadev On Ram Setu : 'రామ్ సేతు'లో ఫన్ లవింగ్ రోల్ - సత్యదేవ్ మేజర్ అప్‌డేట్‌

Satyadev On Ram Setu : 'రామ్ సేతు'లో ఫన్ లవింగ్ రోల్ - సత్యదేవ్ మేజర్ అప్‌డేట్‌