Deepavali: దీపావళి రోజున చీపురు కొంటే సిరిసంపదలు కలిసొస్తాయిట... దానం చేసినా చాలా మంచిదంటున్న పండితులు
దీపావళి వచ్చిందంటే ఇంటి ఇల్లాలు లక్ష్మీపూజలో, పిల్లలు బాణాసంచా కాల్చడంలో బిజీ అయిపోతారు.
ప్రతియేటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళిని నిర్వహించుకుంటారు భారతీయులు. ఆ మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహించుకోవడం ప్రతీతి. ఈరోజున లక్ష్మీపూజ చేస్తే సిరిసంపదలు కలిసొస్తాయని నమ్మకం. అలాగే మరో నమ్మకం కూడా ప్రజల్లో నానిపోయింది. అదే దీపావళి రోజున కొత్త చీపురు కొంటే ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటామన్నది ఆ నమ్మక సారాంశం.
సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు హిందూ ఆచారంలో. అందుకే దీపావళి రోజున చీపురు కొంటారు చాలా మంది. కొత్త చీపురు కొని ఇంటికి తీసుకొచ్చామంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భావిస్తారు. ఇంటికి తీసుకొచ్చిన కొత్త చీపురుకు పూజ చేసిన తరువాత ఉపయోగించడం మొదలుపెడతారు. చీపురును చాలా తక్కువగా చూస్తారు ఇళ్లల్లో. కాళ్లతో తన్నడం, తొక్కడం, నిర్లక్ష్యంగా విసిరి కొట్టడం వంటివి చేస్తారు. అలాంటివి చేయకూడదని చెబుతోంది హిందూశాస్త్రం.
Also read: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల
సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును అవమానించే పనులు చేయకూడదు. శుభ్రం చేశాక దాని స్థానంలో దాన్ని పెట్టేయాలి. చీపురును దీపావళి పండుగ రోజు కొని తెచ్చుకుంటే సిరిసంపదలు పెరుగుతాయంటారు కాబట్టి కొత్త చీపురు కొని తెచ్చుకోండి. అన్నట్టు పండితులు చెప్పిన ప్రకారం చీపురును దానం చేసినా కూడా చాలా మంచిది. హిందూమత ఆచారాలకు విలువ ఇచ్చే వారంతా దీపావళి రోజున చీపురును కూడా పవిత్రంగా చూడాలి అని చెబుతున్నారు పండితులు. ఇంకెంకాలస్యం లక్ష్మీ పూజకు సిద్ధమవుతున్నవారు ఓ చీపురును కూడా కొని తెచ్చుకోండి.
Also read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి