అన్వేషించండి

విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న విద్యార్థుల డిమాండ్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివెనుకున్న పురాణాల సందేశం ఏంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పేపర్ లీక్ పట్ల విద్యార్థుల నిరసనలు దిల్లీలో వెల్లువెత్తాయి.
  • మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
  • జ్ఞాన సంరక్షణ, విద్యార్థుల విజయంగా దీనిని విశ్లేషకులు వర్ణించారు.
  • అధికారం కన్నా ధర్మమే ముఖ్యమని పురాణాల ఉదంతాలు చెబుతున్నాయి.

Dharmendra Pradhan Resignation: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తాయ్. ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామా ప్రకటించారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఇది యుగధర్మం, జ్ఞాన సంరక్షణ, అధికారం ముందు విద్యార్థుల విజయంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.

GenZ Protests Dharmendra Pradhan Resignation: నాడు రైతులు - నేడు జెన్‌జీ - ప్రజాఉద్యమాలకు మోదీ సర్కారైనా తలొగ్గాల్సిందే !

గురు-శిష్య పరంపర (భాగవతం, మహాభారతం)

పురాణాల్లో విద్య/జ్ఞానం దేవతా సమానం. దాన్ని కలుషియం చేసినా, చేయాలి అనుకున్నా ధర్మం దెబ్బతింటుంది. ఇందుకు ఉదాహరణ మహాభారతంలో ఉపమన్యుడి గాథ.

గురువు దౌమ్యుడు శిష్యుడైన ఉపమన్యుడికి ఎన్నో కఠిన పరీక్షలు పెట్టాడు. అపారమైన భక్తి, దృఢత్వంతో గురు ఆదేశాలు పాటించి జ్ఞానం పొందాడు ఉపమన్యుడు. ఇక్కడ శిష్యుల దృఢత్వం గురు వ్యవస్థను ఉద్ధరించింది. విద్యార్థుల ఆందోళన కూడా ఈ కోవకు చెందినదే. సోనమ్ వాంగ్‌చుక్ ఇక్కడ విద్యార్థులకు గురువు. జ్ఞాన వ్యవస్థలో అన్యాయం పట్ల విద్యార్థుల తిరుగుబాటు, నైతిక బాధ్యత తీసుకుని సంబంధిత శాఖ మంత్రి తప్పుకోవడం ధర్మ స్థాపన. 
 
రాజు - అధికారి నైతిన బాధ్యత ( రామాయణం)

రాయామణంలో రాముడు ప్రజాధర్మం కోసం తన వ్యక్తిగత సుఖాలు త్యాగం చేశాడు. అంటే..అధికారం కన్నా ధర్మమే ముఖ్యం. పురాణాల్లో హరిశ్చంద్రుడు లాంటి ఎందరో రాజులు సత్యం, ధర్మం కోసం సింహాసనం, అధికారం వదిలేశారు. ఇక్కడ మంత్రి రాజీనామా అంటే అధికార వ్యవస్థలో నైతిన బాధ్యత - ఇది రాజ ధర్మం. అయితే ఇది విద్యార్థుల ఒత్తిడి ద్వారా జరిగిన ధర్మస్థాపన.

CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !

దేవ - అసుర సంగ్రామం - జ్ఞాన రక్షణ

అసురులు లాంటి వ్యక్తుల చేతుల్లో జ్ఞానం కోల్పోతున్నప్పుడు ధర్మ స్థాపన జరగాల్సిందే. పేపర్ లీక్ అధర్మమే..ఎందుకంటే.. యోగ్యులకు అవకాశం రాకుండా చేయడమే. వ్యవస్థను శుద్ధి చేసే దిశగా విద్యార్థుల ఉద్యమం..మంత్రి రాజీనామాతో ధర్మస్థాపనకు ఓ అడుగు పడిందనుకోవాలి
 
కర్మ ఫలం - యుగ ధర్మం

విద్య అనేది బ్రహ్మ విద్యకు మూలం..దాన్ని కలుషితం చేస్తే ప్రజలు ఉద్యమిస్తారు..ఇది స్వయం ధర్మం..

రాజీనామా అనేది ఓ వ్యక్తి పతనం కాదు..అది త్యాగం ద్వారా వ్యవస్థ శుద్ధి. ఇది భగవద్గీత సందేశం. కర్మను నిర్వర్తించి ఫలాన్ని ఆశించకుండా వదిలేయడం. 

విద్యార్థుల విజయం అంటే శక్తి జాగృతం - యువత గట్టిగా అనుకుంటే ధర్మాన్ని కాపాడుతారని అర్థం.. అయితే ఇదే పూర్తి విజయం కాదు.. తర్వాత సంస్కరణలు (ధర్మ స్థాపన) అత్యంత ముఖ్యం
 
సత్యం, ధర్మం ముందు అధికారం తలవంచాల్సిందే

విద్యార్థుల దృఢత్వం శిష్య ధర్మం

మంత్రి రాజీనామా రాజధర్మం

జ్ఞాన వ్యవస్థ శుద్ధివైపు అడుగుపడితే...ఇది శుభసూచనే..

Dharmendra Pradhan Letter Summary: ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు రాసిన లేఖలో ఏం ఉంది? పూర్తి వివరాలు ఇవే!

Frequently Asked Questions

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులు ఎందుకు నిరసన తెలిపారు?

పేపర్ లీక్ కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఇది జ్ఞాన వ్యవస్థలో అన్యాయంపై వారి తిరుగుబాటు.

నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చేశారు?

విద్యార్థుల నిరసనలు, డిమాండ్లకు స్పందిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇది అధికార వ్యవస్థలో నైతిక బాధ్యతగా విశ్లేషకులు భావించారు.

ఈ ఘటనను విశ్లేషకులు ఎలా అభివర్ణిస్తున్నారు?

ఇది యుగధర్మం, జ్ఞాన సంరక్షణ, అధికారం ముందు విద్యార్థుల విజయంగా అభివర్ణిస్తున్నారు. మంత్రి రాజీనామా ధర్మస్థాపనకు ఓ అడుగుగా పేర్కొన్నారు.

మంత్రి రాజీనామాను రాజధర్మంతో ఎందుకు పోల్చారు?

ప్రజాధర్మం కోసం వ్యక్తిగత సుఖాలు త్యాగం చేసిన రాముడిలా, అధికారి నైతిక బాధ్యత వహించడాన్ని ఇది సూచిస్తుంది. విద్యార్థుల ఒత్తిడి ద్వారా జరిగిన ధర్మస్థాపన ఇది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Wishes 2026: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget