Thiruppavi pasuralu: తిరుప్పావై మొదటి 3 రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం
Dhanurmasam Special: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ నెలరోజులు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పారాయణ జరుగుతుంది. అందులో మొత్తం 30 పాశురాలుంటాయి.. మొదటి 3 పాశురాలు వాటి అర్థం ఇక్కడ తెలుసుకోండి
Dhanurmasam Special Thiruppavi pasuram 1 ,2 and 3 : ధనుర్మాసం నెలరోజులు వైష్ణవ ఆలయాల్లో పాశురాలు ఆలపిస్తారు.. గోదాదేవి రాసిన ఈ 30 పాశురాలను తిరుప్పావై అంటారు. మొదటి ఐదు పాశురాల్లో తిరుప్పావై గొప్పతనాన్ని తెలియజేస్తుంది గోదాదేవి.
పాశురం 1 ( డిసెంబర్ 16న పఠించాల్సినది)
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !
భావం : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికల్లారా మార్గశిరమాసం అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో వెన్నెల మల్లెపువ్వులా ఉంటుంది. శూరుడైన నందగోపుని కుమారుడు, విశాల నేత్రాలు కలిగిన యశోదకు బాల సింహం లాటి వాడు, నల్లని మేఘంలాంటి శరీరం కలిగినవాడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు..సూర్యుడిలా తేజోమయుడైన నారాయణుడి వ్రతం చేసేందుకు సిద్ధంకండి. మార్గశిర స్నానమాచరించేందుకు రండి అంటూ గోదాదేవి గొల్లభామలను ఆహ్వానిస్తోంది.
Also Read: పల్లె అందాలు, ఆలయాల విశిష్టత, భగవంతుడి గొప్పతనం వివరించే పాశురాలు.. అవే తిరుప్పావై!
తిరుప్పావై రెండో రోజు పాశురం ( డిసెంబర్ 17న పఠించాల్సినది)
2. వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
భావం : గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా..మనం చేయబోయే వ్రతానికి ఆచరించాల్సిన నియమాలు వినండి! శ్రీ మన్నారాయణుడిని కీర్తిస్తాం.. దానికి సమానమైన భోగభాగ్యాలేవీ లేవు. స్వామిని సేవించనిదే పాలు త్రాగము, నేతిని భుజించం, సిగలో పూలు పెట్టుకోం ... వివాదాల జోలికి పోం, దాన ధర్మాలు ఆచరిస్తాం. ధనుర్మాసం నెలరోజులు ఇవే ఆచరిస్తాం..ఇదే మన ప్రతం అంటూ గోదాదేవి వ్రత నియమాలను రెండో పాశురంలో వివరించింది. శ్రీకృష్ణుడికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం..భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదని చెబుతోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం
తిరుప్పావై మూడో రోజు పాశురం ( డిసెంబర్ 18న పఠించాల్సినది)
3. ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
భావం: బలిచక్రవర్తి నుంచి మూడు అడుగుల దానాన్ని పొందిన వామునుడు భూమి నుంచి ఆకాశమంత ఎత్తుకి ఎదిగి మూడు లోకాల్లో నిండి ఉన్నాడు. ఆ పరమానంద మూర్తి దివ్య చరణాలు స్పృశించి, ఆయన దివ్య నామాలు స్మరించే వారికి అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ దివ్య వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి..పంటలు త్రివిక్రముడిలా ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతాయి..మంచి దిగుబడినిస్తాయి. గోవులకు గ్రాసం లభిస్తుంది..పాడి పంటలు సమృద్ధిగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకానికి మంచి చేసే ఈ వ్రతాన్ని చేద్దామని సఖులను పిలుస్తోంది గోదాదేవి.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!