By: RAMA | Updated at : 09 Dec 2022 01:55 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Christmas Celebrations 2022: హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతానికి చెందిన దేవుడైనా చెప్పేదొకటే. మంచి ఆలోచించు, నలుగురికి సాయం చేయు, మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వొద్దని. ఎన్ని మత గ్రంధాలు చదివినా వాటి భావం మాత్రం ఇదే. ముఖ్యంగా స్నేహానికి మతానికి అస్సలు సంబంధం ఉండదు. మన స్నేహితుల్లో అన్ని మతాల వారు ఉంటారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఇలా ముఖ్యమైన పండుగల సమయంలో చాలామంది కలపి జరుపుకునే సందర్భాలున్నాయి. ఇంతకీ ఇప్పుడు చెబుతున్నదేంటంటే... క్రిస్మస్ ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలని అనుకునే వారికి మేం కొన్ని టిప్స్ చెబుతున్నాం.
1. శాంటాగా మారిపోండి.
క్రిస్మస్ అనేది కానుకల పండుగ. శాంటా అందరికీ బహుమతులు అందిస్తారని అంటారు. ఈ పండగ సందర్భంగా తమకు వచ్చే బహుమతుల కోసం వేచిచూస్తుంటారంతా. అందుకే మీరే శాంటా క్లాజ్‌గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికి వాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీనివల్ల మీరు పొందే ఆనందం అనిర్వచనీయం.
Also Read: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!
2. అనాథాశ్రమాలకు వెళ్లండి
మనం శాంటాగా మారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు అందిస్తుంటాం. అయితే ఇలాంటి బహుమతులు అవసరం అయ్యే అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే ఈ ఏడాది కాస్త కొత్తగా కుటుంబ సభ్యులతో పాటూ అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు విభిన్న బహుమతులు ఇచ్చేందుకు ట్రై చేయండి. వారు అడిగింది కొనిచ్చే అమ్మానాన్నలు లేరుకాబట్టి శాంటా రూపంలో అమ్మానాన్నగా మారి వారిని ఆనందపరిస్తే అంతకుమించిన పండుగ మరేముంటుంది.
3. కేక్, కుకీస్, వంటకాలు చేసుకోండి.
క్రిస్మస్ అంటేనే కేకుల సంబరం. నెల రోజుల ముందునుంచీ కేకుల తయారీలో బిజీగా ఉంటారు. రమ్ కేక్, కుకీస్, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్స్ తయారుచేస్తుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులు ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయండి. ఎప్పుడూ చేసేవి కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి.
4.‘క్రిస్మస్ ట్రీ’ని అలంకరించండి.
క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. దీని అలంకారం ఓ ఆర్ట్. మీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి అందరి కన్నా భిన్నంగా క్రిస్మస్ ట్రీ అలంకరించండి. దానికింద కొన్ని బహుమతులు పెట్టి ఇంట్లో పిల్లలు ఉంటే వారికి, లేదంటే చుట్టుపక్కల కొందరు పిల్లలకు పంచండి. మీ క్రియేటివిటీ పెరగడమే కాదు చూసినవారూ ఆనందపడతారు.
Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె
5. ఇంటిని డెకరేట్ చేయండి.
ఏ పండుగకైనా ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరిస్తుంటాం. కేవసం క్రిస్టియన్స్ మాత్రమే కాదు ఇంటిని అందంగా అలంకరించడం అందరూ చేయొచ్చు. సో మీకు కాస్త విభిన్నంగా అలంకరించేందుకు ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్.. వీటితో పాటు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయగా మిగిలిన వస్తువులతో కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు.
6. స్నేహితులతో పార్టీ
స్నేహితులతో పార్టీ అనేది కామన్. కానీ క్రిస్మస్ సందర్బంగా పార్టీ డిఫరెంట్ గా ఉండాలంటే హోటల్స్ లో కాకుండా ఇంట్లోనే జరుపుకోండి. రంగురంగుల లైట్లతో ఇంటిని డిస్కోలా మార్చేసి ఎంజాయ్ చేయండి.
7. రొమాంటిక్ క్యాండల్ లైట్ డిన్నర్..
ఫ్రెండ్స్ తో పార్టీ సంగతి సరే..మరి మీ మనసుకి దగ్గరైనవారి సంగతేంటి.. అందుకే స్నేహితులతో పార్టీ పూర్తైన వెంటనే మీ మనసుకి దగ్గరైన వారితో రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. ఇందులో క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్ అన్ని ఉండేలా చూసుకోండి. కుదిరితే ఇంట్లో లేదంటే హోటల్లో అయినా ఓకే..
8. క్యాంప్ ఫైర్ వేసుకోండి
హడావుడి మొత్తం పూర్తైన తర్వాత ఇంటి ఆవరణలో కానీ దగ్గర్లో ఉన్న పెద్ద గ్రౌండ్ లో కానీ క్యాంప్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేయండి.
Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు
Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు
Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం
25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు
Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>