అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Christmas 2022: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!

Christmas 2022: క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరించుకోవడం, కేక్, బహుమతులు ఇవన్నీ కామన్..అయితే కొన్ని ప్రాంతాల్లో వింత వింత సంప్రదాయాలు పాటిస్తారు అవేంటంటే…

Christmas 2022:  క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. అందుకే చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే భలే ఇష్టం. కుటుంబ సభ్యులు కొందరు శాంటాక్లాజ్ గా మారి సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు.  కొందరైతే పేదలకు ఆహారం, బహుమతులు అందిస్తారు. మరికొందరు వారితోనే వేడుక జరుపుకుంటారు. అసలు క్రిస్మస్ అంటేనే ట్రీ, శాంటా క్లాజ్ . అందుకే ఈ పండుగ వచ్చిందంటే వీటిపై చాలా దృష్టి పెడతారు. ఇంటిని అందంగా అలంకరించడం, ఆ చెట్టుకింద బహుమతులు పెట్టి ఇంట్లో వాళ్లని సర్ ప్రైజ్ చేయడం చేస్తుంటారు. అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ మేకింగ్ చేస్తుంటారు. అయితే అలంకారం, కేక్, బహుమతులు ఇవన్నీ కామన్...కొన్ని దేశాల్లో వింత వింత సంప్రదాయాలు ఫాలో అవుతుంటారు. అవేంటంటే...

Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

  • స్లోవాకియాలో క్రిస్మస్‌ రోజున ఒక విచిత్ర సాంప్రదాయం అమలుచేస్తారు. పెళ్లి కానివారు ఆ రోజు గుమ్మానికి  అంటే ఇంటి ఎంట్రన్స్ కి వెనక్కు తిరిగి నిల్చుని చెప్పు తీసి విసురుతారు. ఆ చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడిందంటే త్వరలో పెళ్లవుతుందని నమ్ముతారు
  • పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ రోజు సాంప్రదాయంగా 'టర్కీ' పక్షిని తింటారు
  • జపాన్లో చికెన్ అమ్మకాలు మామూలు రోజులకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి
  • అంతటా ప్లం కేక్‌ సాంప్రదాయంగా ఉంటే జపాన్‌లో స్పాంజ్‌ కేక్‌ ఎక్కువ.. అయితే క్రిస్మస్ రోజు అమ్మకం కాని కేకులను ఆ తర్వాత రోజు ఎవ్వరూ కొనుగోలు చేయరు, ఇంట్లో ఉండిపోయినవి కూడా తినరు... పారేయాల్సిందే...
  • ఫిన్లాండ్‌లో క్రిస్మస్‌ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ రోజు వంట చేసి అవన్నీ బల్లపై పెట్టేసి..మంచాలు సిద్ధం చేసి ఇంట్లో వాళ్లంతా నేలపై పడుకుంటారు. గతించిన వారు వచ్చి తినేసి పడుకునేందుకు వీలుగా అలా చేస్తారట
  • స్వీడన్లో  పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్‌ ఈవ్‌ అర్ధరాత్రి ఆ మేకను కాల్చేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది.
  • మామూలుగా అయితే క్రిస్మస్‌ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. దీని వెనుక స్థానికులు ఓ కథ చెబుతారు...ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్‌ చెట్టుని అలంకరించే స్థోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్‌ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలెపోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగించాయట. అందుకే సాలెగూళ్లను వేలాడదీస్తారు

Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె

ఇంకా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి.. కొన్ని కొన్ని దేశాల్లో వింత సంప్రదాయాలు. ఏవరు ఏం అనుసరించినా ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషం నింపాలి. ఇరుగు-పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొనాలి. సాటివారిపై ప్రేమ, కరుణ పెరగాలి.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget