2023లో కర్కాటక రాశి ఫలితాలు2023లో కర్కాటక రాశివారికి అష్టమ శని కొన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే దేవగురు బృహస్పతి మంచి స్థానంలో ఉండడం వల్ల ఆ నష్టాలు భర్తీ అవుతుంటాయి.మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు, ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కాస్త కష్టమైనా మీ రంగాల్లో మీరు విజయం సాధించగలరు.ఎనిమిదో ఇంట శని సంచారం వల్ల ఏడాది ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు..అదే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది .బృహస్పతి శుభ సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. తీర్థయాత్రలు సందర్శిస్తారు. శని ఆటంకాలు కలిగిస్తుంటే బృహస్పతి ఆ ఆటంకాలు తొలగించి మీకు దారి చూపిస్తాడు2023లో మొదటి నాలుగు నెలలు ఆర్థిక ప్రణాళికలు ప్రణాళిక ప్రకారం సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ప్లాన్ చేసుకోవచ్చు. ఏం చేసినా అదృష్టం కలిసొస్తుంది. ఏపని చేయాలని నిర్ణయించుకున్నారో అది పక్కాగా పూర్తిచేయగలుగుతారు.తల్లిదండ్రులు, గురువు,స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు, ఉద్యోగులకు శుభ ఫలితాలున్నాయి, పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.గతంలో కుటుంబం నుంచి ఉన్న కొన్ని ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది... కుటుంబంలో ఇతర గొడవలు మీ వ్యక్తిగతజీవితంపై పడకుండా చూసుకోవాలి.2023లో ద్వితీయ నాలుగు నెలలు కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. ఈ సమయంలో ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. అధిక పనిభారం మీతో ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు ఉండొచ్చు. పాత సమస్యలు మళ్లీ వెంటాడే అవకాశం ఉంది.2023లో చివరి నాలుగు నెలలు ప్రశాంతంగా ఉంటారు. సుదూర ప్రయాణాలు మనసుని అహ్లాదపరుస్తాయి. మీ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏడాది కర్కాటక రాశివారు ఆస్తి కొనుగోలు చేయగలుగుతారునోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు


Thanks for Reading. UP NEXT

ఈ రాశి జంటల మధ్య అల్లరి తగాదాలు

View next story