అన్వేషించండి

Ashadha Friday: ఆషాఢ శుక్రవారం ఈ లక్ష్మీ మంత్రాల‌ను పఠిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదు

Ashadha Friday: ఆషాఢ శుక్రవారం ఈ లక్ష్మీ మంత్రాల‌ను పఠిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదు

Ashadha Friday Lakshmi Mantra Benefits: హైంద‌వ సంస్కృతిలో శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేశారు. కాబట్టి ఈ రోజు మనం ఒక చిన్న లక్ష్మీ మంత్రాన్ని జపించినా ఆమె సంతోషిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి..? ఆషాఢ శుక్రవారం త‌ప్ప‌కుండా ఈ లక్ష్మీ మంత్రాలను పఠించండి.

హిందూ సంప్రదాయాల ప్రకారం, వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేశారు. అదే విధంగా, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజు లక్ష్మీదేవిని సంప్ర‌దాయం ప్రకారం పూజించడం, ప్రత్యేక మంత్రాలను పఠించడం ద్వారా లక్ష్మీదేవి త్వరగా ప్రసన్న‌మై తన భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదని, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతారు. ఇది మాత్రమే కాదు, శుక్ర దోషం నుంచి విముక్తి పొందడానికి కూడా శుక్రవారం లక్ష్మీ మంత్రాలను జపిస్తారు.

Also Read : శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

శుక్రవారం ఈ మంత్రాలను జపించండి

1. లక్ష్మీ బీజ మంత్రం

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద

ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః॥

2. శ్రీ లక్ష్మీ మహామంత్రం

ఈ లక్ష్మీ మహామంత్రం వ్యక్తికి శ్రేయస్సునిచ్చే మంత్రం.

"ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహి సర్వ సౌభాగ్య దేహి మే స్వాహా"

3. ఆర్థిక ఇబ్బందుల నివార‌ణ‌ మంత్రం

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఆర్థిక‌ సమస్యలన్నీ తీరుతాయి.

ఓం హ్రీం శ్రీ క్రీమ్ క్లీం శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరే

ధన్ పూరయే, చింతయేం దుర్యోయే - దురోయే స్వాహా ||''

4. ఆనందం, శ్రేయస్సును అనుగ్రహించే మంత్రం

"యా రక్తాంబుజవాసినీ విలాసినీ ఛన్దశు తేజస్వినీ|

యా రక్త రుధిరాంబర హరిఖీ యా శ్రీ మనోళాదినీ||

యా రత్నాకరమంథానాత్ప్రగతితా విష్ణోస్వయ గేహినీ|

సామాంపాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ||''

ఆషాఢ శుక్రవారం నాడు పైన పేర్కొన్న మంత్రాల‌తో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది. లక్ష్మీదేవి తన భక్తులను త్వరగా అనుగ్రహిస్తుంది. ఈ మంత్రాలను పఠించడం ద్వారా, మీరు జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని పొందుతారు. దీనితో పాటు శ్రేయస్సు, సంపద, ఆనందం కలుగుతాయి.

Also Read : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!

మీరు మీ జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే, ఆషాఢ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు పూజానంతరం ఈ మంత్రాల‌ను పఠించండి. దీని వల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

గరుడ పురాణం: భూమ్మీదకు వచ్చేముందు ఆత్మ చివరి ఆలోచన ఏంటి?
గరుడ పురాణం: భూమ్మీదకు వచ్చేముందు ఆత్మ చివరి ఆలోచన ఏంటి?
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
Kokila vrat 2026: ఆషాఢ మాసంలో కోకిల వ్రతం ఎప్పుడైనా చేశారా? వ్రత విధానం ఏంటి, ఎందుకు చేయాలి తెలుసుకోండి!
ఆషాఢ మాసంలో కోకిల వ్రతం ఎప్పుడైనా చేశారా? వ్రత విధానం ఏంటి, ఎందుకు చేయాలి తెలుసుకోండి!
Guru Purnima 2026 Date: గురు పూర్ణిమ జూలై 28 or 29 ఎప్పుడు? శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!
గురు పూర్ణిమ జూలై 28 or 29 ఎప్పుడు? శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget