అన్వేషించండి

Chanakya Niti : చాణక్య నీతి: సమస్యలకు ఇదే మూలం, దీనిని అదుపులో ఉంచుకుంటేనే ఆనందం

మానవ జీవితంలోని అనేక‌ సమస్యలకు వారి అల‌వాట్లే మూల కార‌ణ‌మ‌ని స్పష్టంచేశాడు. త‌న అల‌వాట్ల‌ను అదుపులో ఉంచుకోగ‌లిగిన వారు, సంక్షోభం ఎదురైన‌ప్పుడు కూడా ఆనందాన్ని కోల్పోర‌ని వివ‌రించాడు.

Chanakya Niti : ఒక వ్యక్తి ప్రస్తుత లేదా పూర్వ జన్మలో చేసిన క‌ర్మ‌ల‌ ఫ‌లితంగానే సుఖ‌, దుఃఖాల‌ను అనుభవిస్తాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి 13వ అధ్యాయం 15వ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు, మనిషి అలవాట్ల గురించి వివ‌రించాడు. అల‌వాట్ల కార‌ణంగానే ఓ వ్య‌క్తి చేసిన ప‌నిలో ఫ‌లితం పొందుతాడ‌ని తెలిపాడు. మానవ జీవితంలోని అనేక‌ సమస్యలకు వారి అల‌వాట్లే మూల కార‌ణ‌మ‌ని స్పష్టంచేశాడు. త‌న అల‌వాట్ల‌ను అదుపులో ఉంచుకోగ‌లిగిన వారు, సంక్షోభం ఎదురైన‌ప్పుడు కూడా ఆనందాన్ని కోల్పోర‌ని వివ‌రించాడు. అలాకాకుండా అల‌వాట్లు వ్య‌క్తిపై ఆధిపత్యం చెలాయిస్తే, అత‌నికి విజయం చాలా దూరంగా ఉంటుంద‌ని.. ఫ‌లితంగా కోరి కష్టాలను తెచ్చుకుంటార‌ని వెల్ల‌డించాడు. జీవితంలో క‌ష్టాల‌ను తెచ్చే అంశాల‌పై చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

అనవస్థికాయస్య న జ‌నే న వ‌నే సుఖం ।

జనో దహతి సంఘాద్ వాన్ సగ్వివర్జనాత్ ॥

ఆచార్య చాణక్యుడు త‌న‌ శ్లోకాల ద్వారా ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యలకు మూల కారణం అతని మనస్సు అని స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి మనస్సు అదుపులో లేకుంటే, అతను ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా ఉండలేడు. ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు, స‌దుపాయాలు అత‌నికి అందుబాటులో ఉన్నప్పటికీ చంచ‌ల‌మైన‌ మనస్సు ఆ వ్య‌క్తిని ఇబ్బంది పెడుతుంది. అటువంటి వారు ఏ ప‌ని ప్రారంభించినా విజ‌యం సాధించ‌లేరు. మనసును అదుపులో ఉంచుకునే శక్తి లేని వ్యక్తులు పెద్ద కుటుంబంలో ఉన్నా లేక‌ ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండరని చాణక్యుడు చెప్పాడు.

వారికి నిత్యం అసంతృప్తి

చాణక్య నీతి ప్రకారం, మనస్సుపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తికి ప్రజల సాంగత్యం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అతను ప్రజల విజయాన్ని చూసి అసూయపడతాడు. అందువ‌ల్ల‌ అతను ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అలాంటి వ్యక్తులు పని చేయాలని కూడా భావించరు. ఫ‌లితంగా వారు చేప‌ట్టే ప‌నులు పూర్తి చేయ‌లేక విఫ‌ల‌మ‌వుతూ ఉంటారు. అదే సమయంలో ఒంటరితనం అతన్ని లోపల నుంచి నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉందనే భావన కలుగుతుంది.

లక్ష్య సాధ‌న‌కు ఈ ల‌క్ష‌ణాలు ఉండాలి

మోసం చేసే ల‌క్ష‌ణం, చెడు పనులకు పాల్పడే వ్యక్తి సంప‌ద‌ను అనుగ్ర‌హించే లక్ష్మీదేవి కృప‌కు ఎప్ప‌టికీ పాత్రుడు కాలేడ‌ని ఆచార్య చాణ‌క్యుడు స్ప‌ష్టంచేశాడు. అంతేకాకుండా అలాంటి వ్య‌క్తులు తాము ప్రారంభించిన ప‌ని పూర్తిచేయ‌లేక‌ లక్ష్యం చేరుకోలేక ప‌రాజ‌యం పొందుతార‌ని తెలిపాడు. లక్ష్యాన్ని సాధించాలంటే స‌జ్జ‌న‌ సాంగత్యం, క్రమశిక్షణ, మనసుపై నియంత్రణ, సాధించాల‌నే త‌ప‌న‌ ఉండాల‌ని సూచించాడు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ ఉంటే సంప‌ద‌తో పాటు సమాజంలో వ్య‌క్తిగ‌త‌ ప్రతిష్ఠ‌ కూడా పెరుగుతుంద‌ని వెల్ల‌డించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget