అన్వేషించండి

Chankya Niti: శత్రువుతో ఇలా వ్యవహరిస్తే వారిని ఓడించడం చాలా తేలిక!

Chankya Niti: శత్రువుతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడూ మీకు హాని చేసేందుకు పొంచి ఉంటారని మర్చిపోరాదు. అలాంటి వారితో ఎలా వ్యవహరించాలో చాణక్యుడు సూచించారు

Chankya Niti In Telugu: ఆచార్య చాణక్యుడు, విష్ణుగుప్తుడు ఇద్దరూ ఒకరే. చాణక్య విధానాలు భారతీయ చరిత్రలో ముఖ్యమైన పుస్తకంగా పరిగణిస్తారు. ఇందులో రాజకీయాలు, పరిపాలనలో మార్గదర్శకాలు మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయానికి చాణక్య విధానాలు ముఖ్యమైనవి అని చెబుతారు. తమ విధానాల్లో శత్రువులను ఓడించేందుకు కొన్ని సూచనలు చేశారు ఆచార్య చాణక్యుడు. ఈ విధానాలకు ఉపయోగిస్తే శత్రువులను ఓడించడం చాలా తేలిక. మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. 

శత్రువుని జయించేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలివే..

బలహీనంగా చూడొద్దు

శత్రువును ఎప్పుడూ బలహీనంగా , తక్కువగా చూడొద్దు. వారు మీకు ఏ విధంగానైనా హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారనే ఆలోచనతో   ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువు దుష్ట స్వభావం ఉన్నా, శత్రువు మీతో సమాన శక్తితో ఉన్నా వారిని బలవంతులుగా భావించి ఓ అడుగు ముందే ఆలోచించాలి
 
సహనం  సంయమనం

సహనం ,  సంయమనం అనేది ప్రతి వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. మీరు శత్రువుకు దగ్గరగా ఉన్నప్పుడు, సహనం సంయమనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలాంటప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 
 
సరైన సమయం కోసం వేచి ఉండండి

ఏదైనా పని చేసే ముందు సరైన సమయం కోసం వేచి చూడండి. అప్పుడు మాత్రమే మీరు చేసే పనికి తగిన ఫలితం పొందుతారు. శత్రువు ఏదైనా  చర్య తీసుకోవాలనుకున్నప్పుడు సరైన సమయం కోసం వేచి ఉండండి. ముందుగా బలమైన ప్రణాళికను సిద్ధం చేయండి.

సహాయం తీసుకోండి

అత్యవస సమయంలో ఇతరుల సహాయం పొందడం తప్పు కాదు. ఎందుకంటే ప్రతిపనినీ ఒంటరిగా చేయలేం. కొన్ని సందర్భాల్లో శత్రువుని ఎదుర్కోవాలంటే మీరు ఒంటరిగా పోరాడలేరు..ఆ సమయంలో ఇతరుల సహాయం అవసరం.
 
బలహీనత తెలుసుకోండి
 
శత్రువును ఓడించాలంటే ముందుగా వారి బలహీనత ఏంటో తెలుసుకోండి. అప్పుడే శత్రువుని సులభంగా ఓడించగలరు.ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బలహీనతను వెల్లడించనివ్వకండి. అది మీ వరకే పరిమితం కావాలి.  

 రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని ఓడించగల ప్రజ్ఞ చాణక్యుడి సొంతం. తనను అత్యంత ఘోరంగా అవమానించిన నందరాజులను గద్దెదించి సామాన్య జీవితం గడుపుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేయడమే కాదు ఏకంగా నంద వంశాన్ని భూస్థాపితం చేశారు ఆచార్య చాణక్యుడు. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా కానీ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యుడి సూత్రం. అయితే మనం ఎంచుకునే మార్గం ఇతరులకు ఎలాంటి హాని కలిగించేది అయి ఉండకూడదు అని సూచించారు.  

గమనిక: పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని వివరాల ఆధారంగా పేర్కొన్న వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..

రామాయణ, మహాభారత కాలంలో ఒకే సమయంలో యుద్ధవిరమణ - ఇప్పుడు భారత్ పాక్ మధ్య కూడా అదే సమయంలో జరిగిందా? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 పాండవుల దూతగా కౌరవుల సభలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు యుద్ధం విరమించాలని కోరాడు. ఆ సమయంలో ఏం చెప్పాడో వివరిస్తూ.. భారత్ - పాక్ యుద్ధవిరామ సమయంలో DGMO బ్రీఫింగ్ ప్రారంభించారు..ఆ కవిత ఇదే

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget