Guru Gochar 2025: ఈ 4 రాశులవారు సెప్టెంబరు వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలి ..మీ జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా!
Jupiter transit in Gemini 2025: దేవగురు బృహస్పతి వృషభ రాశి నుంచి మిథునంలోకి అడుగుపెట్టాడు. ఈ ప్రభావం కొన్ని రాశులవారిని ఇబ్బందుల్లో ముంచెత్తుతుంది.

Guru Gochar 2025: బృహస్పతి మే 09న మిథునరాశిలో ప్రవేశించాడు. గురు గ్రహం మార్పు కారణంగా కొన్ని రాశులవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరి జీవితంలో అతిపెద్ద మార్పులు మొదలవుతాయి. గురు గ్రహం కదలికలో మార్పులు నాలుగు రాశులవారిని కష్టాలపాలు చేస్తాయి. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి.
మిథునంలో గురు గ్రహం సంచారం ఈ రాశులవారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది
సింహ రాశి
సింహ రాశివారు ఈ సమయంలో ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. మీకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని పూర్తిచేయండి కానీ పారిపోవద్దు. పైగా ఈ ఏడాది నుంచి సింహరాశివారికి అష్టమ శని ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో శని సంచరిస్తున్నాడు..సింహ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో శన సంచారాన్ని అష్టమశని అంటారు. ఇది రెండున్నరేళ్లపాటు ఉంటుంది.
తులా రాశి
తులా రాశివారు బృహస్పతి సంచారం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరే హానికరంగా మారుతారు. ఉద్యోగులు సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి
బృహస్పతి మిథున రాశిలో సంచరించే సమయంలో ధసన్సు రాశివారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు నివారించడం మంచిది. లగ్జరీ వస్తువులపై అస్సలు ఖర్చులు పెట్టొద్దు. ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. దురాశకు దూరంగా ఉండాలి. ఈ రాశివారికి అర్ధాష్టమ శని ఉంది. అంటే ధనస్సు నుంచి శని సంచరిస్తున్న మీన రాశివరకూ నాలుగో స్థానంలో శని ఉన్నాడు. ఫలితంగా వీరికి కూడా అర్ధాష్టమ శని బాధలు తప్పవు
మీన రాశి
గురుడి రాశుమార్పు మీన రాశివాకి ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్రుతతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగులు పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పైగా ప్రస్తుతం శని సంచారం మీ రాశిలోనే జరుగుతోంది.శని జన్మంలో ఉన్నాడు..రెండున్నరేళ్లపాటు ఊహించని కష్టాలు తప్పవు.
మే 09న మిథున రాశిలో ప్రవేశించిన గురుగ్రహం.. సెప్టెంబరు 28న కర్కాటక రాశిలోకి అడుగుపెడుతుంది. నవంబరులో కర్కాటక రాశిలో వక్రం ప్రారంభమై తిరిగి డిసెంబరు 07న మిథునరాశిలోకి వస్తుంది. 2026 మార్చి 14 వరకూ మిథునంలో వక్రంలో సంచరిస్తాడు గురుడు..
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
రామాయణ, మహాభారత కాలంలో ఒకే సమయంలో యుద్ధవిరమణ - ఇప్పుడు భారత్ పాక్ మధ్య కూడా అదే సమయంలో జరిగిందా? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
పాండవుల దూతగా కౌరవుల సభలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు యుద్ధం విరమించాలని కోరాడు. ఆ సమయంలో ఏం చెప్పాడో వివరిస్తూ.. భారత్ - పాక్ యుద్ధవిరామ సమయంలో DGMO బ్రీఫింగ్ ప్రారంభించారు..ఆ కవిత ఇదే
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















