India-Pakistan ceasefire: రామాయణ, మహాభారత కాలంలో ఒకే సమయంలో యుద్ధవిరమణ - ఇప్పుడు భారత్ పాక్ మధ్య కూడా అదే సమయంలో జరిగిందా!
Mahabharata Ramayana and Astrology: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవిరామం కుదిరింది. సీజ్ ఫైర్ అనేది ఇదే తొలిసారి కాదు, మహాభారతం, రామాయణ కాలంలోనూ ఉంది..

India-Pakistan ceasefire
పాక్ ని కొట్టేందుకు ఇదే మంచి సమయం
భారత్ ఎందుకు వెనక్కు తగ్గుతోంది?
మనకు బలం ఉన్నప్పుడు కూడా యుద్ధ విరమణ ఎందుకు?
అనే సందేహాలు ఎన్నో వ్యక్తమవుతున్నాయ్..
అయితే యుద్ధవిరమణ , శాంతి ఒప్పందం అనేది మన ఆలోచనపై ఆధారపడి ఉండదని... ఇది కూడా గ్రహాల సంయోగ ప్రభావమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇందుకు ఉదాహరణగా రామాయణం, మహాభారత యుద్ధాల సమయంలో గ్రహాల సంచారం, గ్రహ సంయోగం గురించి ప్రస్తావిస్తున్నారు.
యుద్ధ విరామం (Ceasefire) అంటే ఏంటన్నది ధార్మిక గ్రంథాలలో ప్రత్యేక చర్చ ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవిరమణతో ఈ పదం బాగా పాపులర్ అయింది. అయితే యుద్ధ విరామం సంఘటన ఇదే మొదటిది కాదు..గతంలోనూ యుద్ధ విరామ ప్రకటనలు జరిగాయి.
ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన వివరాలు ప్రకారం మహాభారతం (Mahabharat)లో యుద్ధ విరామం గురించి మొదటి ప్రస్తావన ఉంది. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. మహాభారత యుద్ధంలో సుమారు కోటిన్నర మంది యోధులు మరణించారన్నది అంచనా. వారిలో సుమారు 70 లక్షల మంది కౌరవ పక్షం, 44 లక్షల మంది పాండవుల పక్షం నుంచి యోధులు మరణించారని శాంతిపర్వంలో ఉంది.
'యుద్ధం న క్షమ్యతే యత్ర శత్రుణా సహ సంగతః.
శమేవే ప్రయత్నేన సంసాధ్యం యుద్ధవర్జితమ్'
శత్రువుతో నిరంతరం యుద్ధం జరుగుతున్న చోట కూడా శాంతి మార్గం ఉంటే తప్పనిసరిగా దాన్ని ప్రయత్నించాలి. యుద్ధం కన్నా పరిష్కారం ఉత్తమం. ఇది యుద్ధం మధ్యలో కూడా 'యుద్ధ విరామం' వంటి పరిస్థితి వేద సంస్కారాల భాగంగా ప్రారంభం నుంచి ఉందని స్పష్టం చేస్తుంది.
మనుస్మృతిలో కూడా రాజకీయ సంఘర్షణల్లో శాంతి విధానాలను వర్ణించారు
'యుద్ధం చానుపదిష్టం చ రాజ్ఞా ధర్మ్యం సమాచరేత్
ఆపది చ యథాకాలం యుక్తం నిత్యం సమాచరేత్'
యుద్ధం చేయడం రాజధర్మం. కానీ ప్రమాద సమయంలో కాలానికి అనుగుణంగా విధానాలను మార్చి శాంతిని స్థాపించడం కూడా ధర్మమే. యుద్ధం మాత్రమే కాదు యుద్ధవిరామం కూడా రాజధర్మమే.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. యుద్ధ విరామం పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో వివరిస్తూ.. బృహజ్జాతకంలో దీనికి సంబంధించిన ఒక సూత్రం ఉంది-
'శనౌ చంద్రే చ సమేభ్యం యుద్ధే శాంతిర్న సంశయః.
సౌమ్యగ్రహైః పథి రాజ్ఞో యుద్ధే విశ్రామదాయకః'
దీని అర్థం అంటంటే... శని, చంద్రుడు సమాన స్థితిలో ఉన్నప్పుడు... శుక్రుడు-బుధుడు వంటి సౌమ్య గ్రహాల ప్రభావం ఉంటే యుద్ధ విరామం సాధ్యమవుతుంది. ఇది గ్రహాల శాంతి స్థితి.
2025 మే 10న సాయంత్రం 5 గంటలకు రెండు దేశాల మధ్య యుద్ధ విరామం ప్రకటించిన సమయంలో కుండలిలో దాదాపు అదే పరిస్థితి కనిపించింది
భారత్-పాకిస్తాన్ (India Pak Tension) యుద్ధ విరామం జరిగినప్పుడు తుల లగ్న కుండలి ఏర్పడింది. చంద్రుడు ఆ సమయంలో తుల లగ్నంలోనే ఉన్నాడు. తులా రాశి శనికి ఉచ్ఛ రాశి. శని ఆ సమయంలో మీన రాశిలో రాహువు , శుక్రునితో ఆరోస్థానంలో గోచారం చేస్తున్నాడు. సప్తమ భావంలో మేష రాశిలో సూర్యుడు - బుధుని సంయోగం ఏర్పడింది. శని-చంద్ర సంయోగం శాంతి దిశ చూపిస్తోంది.
జ్యోతిష్య గ్రంథాలతో పాటు రామాయణంలో కూడా 'శాంతి సంధి' గురించి ఉంది.
'న యుద్ధేన హి రాజ్యం వా న ప్రీత్యా శత్రుబంధనమ్.
శమేనేవ జనో రమ్యః, సంగ్రామో వై వికారకః'
అంటే.. రాజ్యం, గౌరవం లేదా సంబంధం యుద్ధం ద్వారా కాదు శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ధార్మిక , జ్యోతిష్యం ఆధారంగా , చంద్రుడు సమాన స్థితిలో ఉన్నప్పుడు యుద్ధ అలసట, విరామానికి అవకాశం ఏర్పడుతుంది. శుక్రుడు, బుధుని దృష్టి చర్చ - ఒప్పంద పరిస్థితిని సృష్టిస్తుంది. మే 10న కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుత సమయంలో మంగళుడు నీచంలో ఉన్నాడు. కర్కాటక రాశిలో మంగళుడు గోచారం చేస్తున్నాడు. 2025 జూన్ 7 వరకు మంగళుడు నీచంలో ఉంటాడు. జ్యోతిష్యంలో మంగళుడిని యుద్ధ కారకంగా భావిస్తారు, కాబట్టి ఇవి అన్నీ యుద్ధ విరామం వైపు సూచిస్తున్నాయని చెప్పవచ్చు, కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులను గుర్తుంచుకోవడం చాలా అవసరం. 2025 మే 14 నుంచి గురు గోచారం జరుగుతోంది . 2025 మే 15న సూర్య రాశి పరివర్తన (Sun Transit) జరుగుతోంది. 2025 మే 18న బుధుడు మంగళుని రాశి మేషంలో అస్తమించబోతున్నాడు. అదే రోజు పాప గ్రహాలైన రాహువు , కేతువుల గోచారం (Rahu-Ketu Gochar) జరుగుతోంది..అలాంటి పరిస్థితిలో యుద్ధ విరామం ఎక్కువ కాలం ఉండే అవకాశం చాలా తక్కువ. మే 25-26 తేదీలు కూడా మంచివిగా అనిపించడం లేదు. గ్రహాల వేగంగా మారుతున్న గమనం సరైన సూచనను ఇవ్వడం లేదు, కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు పాకిస్తాన్ కుండలి (Pakistan Kundli) లో మారకేశ దశ జరుగుతోంది, అలాంటి పరిస్థితిలో రానున్న రోజుల్లో కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా కనిపించవచ్చు, అది మళ్ళీ యుద్ధ పరిస్థితులను సృష్టించవచ్చు. 2025 జూన్ 7న మంగళ గోచారం మళ్ళీ యుద్ధ పరిస్థితులను సృష్టించవచ్చు. పాకిస్తాన్ (Pakistan)లో అధికారంలో ఉన్నవారికి సైన్యం మధ్య అంతర్గత ఘర్షణ వంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అదే సమయంలో పాకిస్తాన్ తన అబద్ధాలను దాచడానికి కొన్ని తప్పులు చేస్తుంది, దీనివల్ల ప్రపంచ వేదికపై అపఖ్యాతి మూటగట్టుకుంటుంది. గురువు ప్రభావంతో పాకిస్తాన్ సైన్యం , అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు ఇతర దేశాల ప్రలోభాలకు లోనై తమ ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సముద్రతీరప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయ్
ఓవరాల్ గా ధార్మిక గ్రంధాలు, జ్యోతిష్య శాస్త్ర గ్రంధాల ప్రకారం...ప్రజాహితం కోసం యుద్ధవిరామం అవసరం. దీన్ని దైవసంకల్పంగా భావించాలి. ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతదేశం పాక్‌పై నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. భూమి మరియు ఆకాశంతో పాటు ఈసారి జలంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..
గమనిక: జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్న వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...






















