By: ABP Desam | Updated at : 12 Jul 2023 08:15 AM (IST)
(Representational Image/Pixabay)
Chanakya Neeti In Telugu : చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన చర్యల ఆధారంగా మంచి చెడు పరిణామాలను, ఫలితాలను అనుభవిస్తాడని చెప్పాడు. ఆయన తన చాణక్య నీతిలో మానవ సంబంధాల గురించి చాలా ముఖ్యమైన విషయాలు వివరించాడు. జీవితంలోని కొన్ని ఆలోచనల గురించి చాణక్యుడు ప్రస్తావిస్తూ.., అవి మనం చివరి శ్వాస తీసుకునే వరకు మనల్ని విడిచిపెట్టవని స్పష్టంచేశాడు. ఈ ఆలోచనలు ఒక వ్యక్తి ఏ కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేసేందుకు దోహదం చేస్తాయని తెలిపాడు. మన పనులు సులువుగా పూర్తి చేసేందుకు చాణక్యుడు చెప్పిన సులువైన చిట్కాలు ఏమిటో తెలుసా..?
Also Read : ఈ 4 విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, లేదంటే ఇబ్బందులు తప్పవు
1. జ్ఞానం
ఆచార్య చాణక్యుడు ప్రకారం, జ్ఞానం అనేది కఠినమైన గోడను ఛేదించి విజయాన్ని సాధించగల సామర్థ్యాన్ని అందించే అటువంటి ఆయుధం. జ్ఞానాన్ని మించిన స్నేహితుడు లేడనే సామెత ఉంది. తెలివైన వ్యక్తి తన పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తికి తను చేసేది ఒప్పో, తప్పో తెలుసు. దాని ఆధారంగా తన పని తాను చేసుకుంటాడు.
2. విజయం గౌరవానికి సంకేతం
జ్ఞానం ఒక వ్యక్తి విజయానికి కారణమైనట్లే, విజయం కూడా వ్యక్తి గౌరవానికి ప్రధాన కారణం. అలాంటి గౌరవం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. అంటే, జ్ఞానం నుంచి పొందిన విజయం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది.
3. ధర్మం
డబ్బు కంటే ధర్మం గొప్పదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. ధర్మం మనిషిని జీవితంలోనే కాదు, మరణానంతరం కూడా వదిలిపెట్టదని ఆయన తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. మన ధర్మాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఒక వ్యక్తి ధర్మానికి కట్టుబడి ఉండటమే అతని విజయానికి కారణమని చాణక్యుడు చెప్పాడు. ఎంత పెద్ద కార్యమైనా భక్తిశ్రద్ధలతో చేస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ధర్మాన్ని అనుసరించి దాని మార్గంలో నడిచేవాడు పుణ్యఫలాలను పొందుతాడు. ధర్మాన్ని అనుసరించేవాడు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతాడు.
Also Read : ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పినట్లుగా, పైన పేర్కొన్న 3 ఆలోచనలను మనస్సులో ఉంచుకుని, తదనుగుణంగా ప్రవర్తించే వ్యక్తి, ఆ వ్యక్తి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఏ పెద్ద పని చేయవలసి వచ్చినా వాటన్నింటిని నిస్సందేహంగా పూర్తి చేస్తాడు. వీటిని మనం నిత్య జీవితంలో పాటించడం చాలా ముఖ్యం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Vastu Tips In Telugu: మీ ఇంటి వాలు మీ ఆదాయ-వ్యయాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా!
ఈ రాశులవారికి ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు
TTD News: అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామి
Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు
Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>