అన్వేషించండి

Chanakya Niti: ఈ 4 విష‌యాల్లో జోక్యం చేసుకోకూడదు, లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు

Chanakya Niti: మన జీవితాలకు దీపం లాంటి చాణక్యుడి నీతి, మనం ఏఏ సంద‌ర్భాల్లో ఎవ‌రి మధ్యకు వెళ్లకూడదో వివరంగా చెప్పింది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎవ‌రి పనిలో జోక్యం చేసుకోకూడదో తెలుసా?

Chanakya Niti: జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకపోవడమే ఆనంద రహస్యం. కానీ, జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే కళ నేర్చుకోవడమే రహస్యం. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన రహస్యాల గురించి చాణక్యుడి నీతి చెబుతుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు సంద‌ర్భాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. మనం ఏ సంద‌ర్భంలో జోక్యం చేసుకోకూడదో తెలుసా?

చాణక్యుని శ్లోకం

"వ్ప్రయోవ్రీప్రవాహనేశ్చ దంపత్యోః స్వామిభృత్యయోః
అంత్రేణ గంథవ్యం హాలస్య వృషభస్ ||''

1. జ్ఞానుల మధ్య జోక్యం చేసుకోకండి
ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన‌ ప్రకారం, ఇద్దరు జ్ఞానులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరూ వారిని అడ్డుకోకూడదు. అలా చేస్తే వారి పనికి ఆటంకం కలుగుతుంది. దీనినే మూర్ఖత్వం అంటారు. తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఇలా చేయడు. అలాంటప్పుడు వాళ్ళ మధ్యకి వెళితే వారు నిన్ను మూర్ఖుడని అనుకుంటారు. ఇది మీ గౌరవ, ప్రతిష్ఠ‌ల‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు

2. భార్యాభర్తల మధ్యకు వెళ్లవద్దు
భార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాలు అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. భార్యాభర్తలు కలిసి కొన్ని పనులు చేసినప్పుడు, వారి పనిలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, ఏ వ్యక్తి కూడా వారి సంభాషణకు అంతరాయం కలిగించకూడదు. ఇది వారి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం కలిగిస్తుందని చాణ‌క్యుడు తెలిపారు.

3. నాగలి - ఎద్దుల మధ్య వెళ్లవద్దు                  
నాగలి, ఎద్దులు కలిసి వెళుతున్న‌ప్పుడు మీరు వాటి మ‌ధ్య‌లోకి వెళ్లి తప్పు చేయకూడదు. అలా వెళితే మీరు గాయాల‌పాలై బాధ ప‌డ‌వచ్చు. ఒక్కోసారి ఈ తప్పు మరణానికి దారితీస్తుందని చాణక్యుడు హెచ్చ‌రించాడు.

4. య‌జ్ఞం- పండితుల మధ్యకు వెళ్లవద్దు             
అగ్నిగుండం దగ్గర పూజారి లేదా వేద పండితులు కూర్చున్నప్పుడు, ఎవరూ వారి మ‌ధ్య‌గా వెళ్ల‌కూడదు. ఇలా చేయడం వల్ల వారి పూజలో ఆటంకాలు ఏర్పడి హవన యాగానికి ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అలా మ‌ధ్య‌లో వెళ్లిన వ్యక్తి పాపంలో పాలుపంచుకుంటాడని చాణక్యుడు చెప్పాడు.

Also Read : భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి పై 4 సంద‌ర్భాల్లో లేదా అలాంటి వ్య‌క్తుల‌ జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు. అలా కాకుండా జోక్యం చేసుకుంటే ఒక వ్యక్తి మరణం లేదా నాశనానికి దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.             

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
Embed widget