Spirituality: ఇంట్లో ధూపం వేస్తే జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా!
Benefits of dhoop: పూజలో ఉపయోగించే ధూపం మన జీవితంలోని అనేక సమస్యలకు కూడా పరిష్కారం చూపుతుంది. ఇంట్లో ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా? ఇంట్లో ధూపం ఎందుకు వేయాలి..?
Benefits of dhoop: దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక మార్గాలను అనుసరిస్తారు. నియమ, నిబంధనలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మనస్సులోని ప్రతి కోరిక నెరవేరుస్తాడని విశ్వసిస్తారు. హిందూ ధర్మంలో దీపాలతో పాటు ధూపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దుర్గామాత పూజలో ధూపం తప్పనిసరి. భగవంతుడి పూజలో వినియోగించే ధూపం వల్ల మన సమస్యలు ఎలా తొలగిపోతాయో తెలుసా.
శని దోషం నుంచి విముక్తి
మత విశ్వాసాల ప్రకారం, ధూపం దుర్గాదేవికి మాత్రమే కాకుండా శనైశ్చరుడికి కూడా చాలా ప్రియమైనది. సూర్యుని కుమారుడైన శని ధూపంతో వెంటనే సంతోషిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో శనిదోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శనిదేవుని ముందు ధూపం వేయాలి. అదే సమయంలో, ప్రతికూల శక్తులు శనివారాల్లో మరింత క్రూరంగా ఉంటాయని చెబుతారు, అటువంటి పరిస్థితిలో, మీరు ధూపంతో మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయవచ్చు. ధూపం ద్వారా ప్రతికూల శక్తి చెడు ప్రభావాలు తొలగిపోతాయి.
Also Read : పూజలో కలువ పూలను ఎందుకు వినియోగిస్తారో తెలుసా?
ధూపంతో హోమం
విశ్వాసాల ప్రకారం, శనివారాలలో ధూపం కోసం ఉపయోగించే సామగ్రితో హవనాన్ని సమర్పించడం ద్వారా దేవతలు సంతోషించడమే కాకుండా దేవతలందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. ధూపం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది.
వ్యాపార పురోగతి కోసం
గురు, ఆదివారాల్లో ఆవు పేడతో చేసిన బేరాన్ని, దానిపై సాంబ్రాణి, బెల్లం, దేశీ నెయ్యి వేసి కాల్చాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
ఆర్థిక సమస్యలకు పరిష్కారం
మట్టి కుండపై కుంకుమ, ఆవు పేడ బెరణి, సాంబ్రాణి వేసి కాల్చాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం వరుసగా 21 రోజుల పాటు చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి
సానుకూల శక్తి కోసం
ఇంటి నుంచి ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలను వదిలించుకోవాలంటే, ఇంట్లో పూజకు ఉపయోగించే సాంబ్రాణి లేదా ధూపం వేయాలి. దీని పొగ వాతావరణంలో సానుకూల శక్తిని పెంచుతుంది.
Also Read : ఏ శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా? ఇలా పూజిస్తే తిరుగుండదు!
సానుకూల ఆలోచనల కోసం
ఇంట్లో ప్రతిరోజూ ధూపం వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని రకాల ప్రతికూల ఆలోచనలు మనస్సు నుంచి దూరమవుతాయి. ధూపం మనం జీవించే వాతావరణాన్ని సానుకూలంగా మార్చడమే కాదు. అది మన మనస్సులో కూడా సానుకూలతను సృష్టిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ ధూపం వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.