దేవుని ముందు కోరుకున్న కోర్కె బయటకు చెబితే తీరదా



భగవంతుడిని పూజించినవారు కోరుకునే కోర్కె కచ్చితంగా బలీయమైనదే అయి ఉంటుంది



కష్టమైనది, మానవసాధ్యం కానిది, తప్పనిసరిగా భగవంతుడి కృపతోనే పూర్తయ్యేది అయి ఉండొచ్చు



అది ధనం కావొచ్చు, సుఖం కావొచ్చు, పదవి కావొచ్చు, ఉత్తమ భాగస్వామి కావొచ్చు..



ఆ విషయాన్ని బయటకు చెబితే వినేవారు హేళన చేసే అవకాశం ఉంటుంది



కొందరైతే బయటకు ఆనందంగా మాట్లాడినా మంచి జరగకూడదని లోలోపల కోరుకున్నా కోరుకుంటారు



పైకి కనిపించని శత్రువులు మీ ఉన్నతికి అడ్డుపడొచ్చు కూడా



అందుకే దేవుడిదగ్గర కోరుకున్న కోర్కె బయటకు చెబితే తీరదు అంటారు



బయటకు చెబితే తీరదని, ఏదో జరిగిపోతుందని భావించాల్సిన అవసరం లేదంటారు పండితులు



Images Credit: Pinterest