Importance Of Conch In Puja: ఏ శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా? ఇలా పూజిస్తే తిరుగుండదు!
Importance Of Conch In Puja: లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి. ఇంట్లో శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీ, విష్ణు, గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో శంఖం పెట్టుకుంటే కలిగే లాభమేంటి?
![Importance Of Conch In Puja: ఏ శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా? ఇలా పూజిస్తే తిరుగుండదు! know what type of conch should be keep in pooja room to get goddess lakshmi and lord ganesha blessings Importance Of Conch In Puja: ఏ శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా? ఇలా పూజిస్తే తిరుగుండదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/c85426c4b7c14c4c1f460cb790e89eac1688669961229691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Importance Of Conch In Puja: హైందవ సంస్కృతిలో సంగీత వాయిద్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. వాటిని దేవతల నివాసంగా కూడా భావిస్తారు. ఈ సంగీత వాయిద్యాలకు సంబంధించి అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. ఇంట్లో దేవుడి గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. పూజ సమయంలో శంఖం ఊదడం వల్ల ఇంటి వాతావరణం అంతా శుభ్రం అవుతుంది. విష్ణు పురాణం ప్రకారం, లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని చెబుతారు. శంఖంలో చాలా రకాలు ఉన్నాయి. హైందవ సంస్కృతిలో వివిధ రకాలైన శంఖాలకు వేర్వేరు ప్రాముఖ్యం ఉంది. ఇంట్లో శంఖాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
కామధేను శంఖం
కామధేను శంఖం ఆవు నోరులా ఉంటుంది. అందుకే దీనిని కామధేను శంఖం అంటారు. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచితే అన్ని పనులు సులువుగా పూర్తవుతాయని విశ్వాసం.
గణేశ శంఖం
వినాయకుని పూజలో గణపతి శంఖాన్ని ఉంచడం ప్రత్యేక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ శంఖాన్ని పూజించడం ద్వారా గణేశుని ఆశీస్సులు లభిస్తాయి. పనిలో అన్ని అడ్డంకులు లేదా ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ శంఖాన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.
ముత్యాల శంఖం
ముత్యాల శంఖాన్ని ఇంట్లో ఉంచి రోజూ పూజిస్తే కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి గదిలో తెల్లటి వస్త్రంపై మోతీ శంఖాన్ని అంటే ముత్యపు శంఖాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
ఐరావత శంఖం
ఐరావత శంఖాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా, ఇంటి వాస్తు దోషాన్ని తొలగి మీరు వాస్తు ప్రయోజనాలను పొందుతారు. ఈ శంఖాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని నమ్ముతారు. ఈ శంఖంలోని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మణి పుష్పక శంఖం
కార్యాలయంలో మణి పుష్పక శంఖాన్ని ఉంచడంతో పాటు దానిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు కీర్తి, గౌరవం లభిస్తాయి. పని ప్రదేశంలో ఉంచిన మణి పుష్పక శంఖం ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు మీకు సహాయం చేస్తుంది.
Also Read : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!
దక్షిణావృత శంఖం
అన్ని శంఖాలలో, దక్షిణావృత లేదా దక్షిణాభిముఖంగా ఉన్న శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. సాధారణంగా అన్ని రకాల శంఖాలు ఎడమ వైపునకు తెరుచుకుని ఉంటాయి. అయితే ఈ దక్షిణావృత శంఖం కుడి వైపునకు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖాన్ని దైవ శంఖంగా పరిగణిస్తారు. ఈ దక్షిణావృత శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది విశ్వసిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)