అన్వేషించండి

Karungali Mala: కరుంగలి మాల గురించి మీకు తెలుసా? ఎవరు ధరించాలి? ఎప్పుడు ధరించాలి? ప్రయోజనాలేమిటీ?

Karungali Mala: ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరుంగాలి మాల గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. దీని ప్రత్యేకతలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

Karungali Mala: ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్‌ అయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి (కరుంగళి కట్టై) మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెప్తున్నారు.

ఈ కరుంగలి మాలను కారుకలి అనే  చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెప్తున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని.. దీని కారణంగానే  ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్ , పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెప్తున్నారు.  జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల  నియంత్రించగలదని.. నల్లమచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు.

కరుంగలి చెట్టుకు ఎన్నో  ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి.

ఈ చెట్టు వేరును తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగి పోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

కరుంగలి రక్తంలో ఐరన్‌ కంటెంట్‌ని పెంచుతుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిఫుణులు సూచిస్తున్నారు. అలాగే  మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు?  ఏ రోజు ధరించాలి?

కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్‌ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  అదేవిధంగా, కుల, మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే  ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు  జ్యోతిష్య నిపుణులు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చని.. వ్యాపారాభివృద్ది కోసం ఉద్యోగార్ధులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కేరీర్‌లో  ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చిన సూచిస్తున్నారు.

ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్‌ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాశ శంభు మురుగన్‌ ఆలయం దగ్గర తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.

ALSO READ: మీరు ఏ ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్ అవుతారో మీ నక్షత్రం చెప్పేస్తుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Laila Release Date: విశ్వక్ సేన్ ‘లైలా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!
విశ్వక్ సేన్ ‘లైలా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Embed widget