News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Bathukamma Festival 2023: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ ఏడాది 14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ జరిగే బతుకమ్మ వేడుకల్లో ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే..

FOLLOW US: 
Share:

Bathukamma 2023: ఏటా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య ( భాద్రపద అమావాస్య) రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ. తెలంగాణ పల్లెల్లో ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ పండుగ వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.

Also Read: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది

ఈ ఏడాది  14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.. ఈ తొమ్మిది రోజులూ ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే...

అక్టోబర్ 14 - ఎంగిలి పూల బతుకమ్మ
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) రోజు జరుగుతుంది. 

అక్టోబర్ 15 - అటుకుల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (నవరాత్రి కలశ స్థాపన) రోజు జరుపుకుంటారు

అక్టోబర్ 16- ముద్దపప్పు బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు  ముద్దపప్పు బతుకమ్మ

అక్టోబర్ 17 - నానే బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ  మూడోరోజైన తదియ రోజు నానేబియ్యం బతుకమ్మ 

అక్టోబర్ 18 - అట్ల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజైన చవితి రోజు అట్ల బతుకమ్మ

అక్టోబర్ 19 - అలిగిన బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ

అక్టోబరు 20 - వేపకాయల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు వేపకాయల బతుకమ్మ

అక్టోబరు 21 - వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ మాసం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మ

అక్టోబరు 22 -సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు.

బతుకమ్మ ఎప్పుడు ప్రారంభమైంది

బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్ల క్రితం నుంచీ ఇది కొనసాగుతూ వస్తోందని  చెప్పేందుకు చాలా కథలు చెబుతారు. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారు. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారు. సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల్లో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.. ఆ ఒక్కరోజు అమ్మవారు అలుగుతుందని అందుకే అలిగిన బతుకమ్మ అంటారని కథనం.

Also Read: ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Published at : 28 Sep 2023 08:37 AM (IST) Tags: Bathukamma Significance In Telugu Bathukamma 2023 Bathukamma festival 2023 Bathukamma begins on October 14 to 23 Bathukamma 2023 Celebrations

ఇవి కూడా చూడండి

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే