అన్వేషించండి

Ayyappa Swamy 18 steps Significance: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!

Pathinettampadi: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18 నంబర్ కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి ? ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!

Sabarimala Temple significance 18 Steps : ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను  ‘పదునెట్టాంబడి’ అంటారు.  ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41  రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు. 18 మెట్లు ఎందుకంటే ...మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు  4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో  కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగసమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారంటారు. 

Also Read: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టిన అయ్యప్ప
అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. 
18 అస్త్రాల పేర్లు
1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం  7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 
11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం  15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం

Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!

18 మెట్ల పేర్లు ఇవే (Ayyappa 18 steps names)
1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య  7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర  13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక

అష్టాదశ దేవతలు
1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 
11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి

 ఏ మెట్టపై  ఏం వదిలేయాలి
అయ్యప్ప ఆలయంలో ఉన్న 18 మెట్లపై ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. 

పంచేంద్రియాలు
మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

అష్టరాగాలు
తర్వాతి  8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని  విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.

3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన
చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.

18 కొండల పేర్లు ఇవే
1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

ఓ మనిషికి  ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గుణాల వరకూ అన్నింటికీ ఈ 18  సంకేతం. అందుకే  18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget