News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ardhanarishvara Tatvam : పురుషుడు స్థిర స్వభావం- స్త్రీ మాయాస్వరూపం ఇదే అర్థనారీశ్వర తత్వం

స్త్రీ పురుషులు సమానం అనే వాదన ఇప్పుడిప్పుడు ఊపందుకుంటోంది. కానీ పురాణ కాలంనుంచే స్త్రీ-పురుషులు సమానం అని చెప్పాడు పరమేశ్వరుడు. ఇంతకీ అర్థనారీశ్వర తత్వం అంటే ఏంటి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి?

FOLLOW US: 
Share:

అర్థ-నారి-ఈశ్వర.....అంటే సగం స్త్రీ-సగం పురుషుడు....ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు. ఆధునిక శాస్త్ర పరిశోధన చెబుతున్నది ఏంటంటే పదార్థం-చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని చక్కనైన దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్థనారీశ్వర తత్వం. అయితే ఫొటోల్లో చూస్తుంటే రెండు ముక్కలు కలిపినట్టు దేహం కనిపిస్తుంది. మనకు క్లియర్ గా అర్థం అయ్యేందుకు ఇలా రూపకల్పన చేశారు కానీ అర్థనారీశ్వర తత్వం అంటే స్త్రీ-పరుషులు కలసి ఒక్కటే అనే అర్థం.

సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది....

  • పగలు-రాత్రి
  • చీకటి-వెలుగు
  • సుఖం-దుంఖం
  • విచారం-సంతోషం

వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనం ఒకటవుతుంది.  పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం-దుంఖం కలిస్తే జీవితం, బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం. ఇలా స్త్రీ-పరుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం. ఒక్కచోటే ఉంటారు ఒకరికొకరు కనపడరు. కానీ ఇద్దరూ కలిస్తేనే విశేషం. 

Also Read:  శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు

ప్రతిమనిషి లోనూ అర్థనారీశ్వర తత్వం ఉంటుంది. పిల్లలను తల్లి కన్నా సున్నితంగా పెంచే తండ్రులు ఉంటారు, తండ్రి కన్నా బాధ్యతగా భావించే తల్లులు ఉన్నారు. అంటే స్త్రీ-పురుషులిద్దరిలోనూ స్త్రీ తత్వం-పురుష తత్వం రెండూ ఉంటాయి. అది అర్థం చేసుకోపోవడం వల్లనే అభిప్రాయ బేధాలు వస్తున్నాయ్. ఇది గుర్తిస్తే వివక్ష ఉండదు. ప్రస్తుత సమాజానికి అర్థనారీశ్వర తత్వం అవసరం కూడా. తల ఆలోచనకి , పాదం ఆచరణకు సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుంచి కాలివరకు..ప్రతి చర్య-ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ... తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా  ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం.

సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం...తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది. సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది. స్థిర తత్వం పురుషతత్వం అయితే...మాయా తత్వం స్త్రీ సొంతం. మళ్లీ మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో....పురాణాల ఉద్దేశం అది కాదు. మార్పు అంటే పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం.

  • బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది
  • ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు
  • వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు
  • ఇక చివరిగా సన్యాస ఆశ్రమం....అంటే సన్యాస ఆశ్రమంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. కానీ నాతిచరామి అన్న భార్య చేయి విడిచిపెట్టడం భావ్యం కాదు. అందుకే తన జీవితానికి పరిపూర్ణనతను కల్పించిన భార్యకు సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు

Also Read:  శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు

అంటే పురుషుడు ఒక్కడే...కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది....అందుకే స్త్రీని మాయాస్వరూపం అంటారు. భార్యగా ఆమెకున్న ఘనతను గుర్తించే తనలో సగభాగం చేసుకుని అర్థనారీశ్వరడుగా మారాడు పరమశివుడు.

Published at : 28 Feb 2022 02:28 PM (IST) Tags: ardhanarishvara tatvam in telugu mystery behind lord shiva's ardhanarishvara roopam ardhanarishvara stotram significance of lord shiva ardhanarishvara the concept & significance of ardhanarishvara

ఇవి కూడా చూడండి

Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు

Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23:  ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత