అన్వేషించండి

Namaskaram at Temples: గర్భగుడిలో దైవశక్తి !ఆలయంలో ఎదురుగా నమస్కారం ఎందుకు నిషేధం?

Agamasastra: సనాతన ధర్మంలో ఆలయ దర్శనానికి సంబంధించి కొన్ని నియమాలున్నాయి. వాటిలో ఒకటి దేవుడికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయకూడదు..ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేవాలయాల్లో దైవానికి ఎదురుగా నిలబడకుండా పక్కకు జరగాలంటారు.
  • ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలో దైవశక్తి ఉంటుంది, గౌరవించాలి.
  • ఆలయ నిర్మాణంలో సూర్య కిరణాలకు అడ్డుగా నిలబడరాదు.

Namaskaram at Temples: ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. నిత్యం ఆలయాలను సందర్శించేవారు కొందరు, ప్రత్యేక రోజులు, శుభదినాలు, పండుగల వేళ సందర్శించేవారు మరికొందరు. అయితే ఏ సందర్భంలో ఆలయానికి వెళ్లినా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దేవుడికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయకూడదు. ఎందుకు? ఈ ఆచారం పాటించడం వెనుకున్న సంప్రదాయ కారణాలేంటి? తెలుసుకుందాం

అప్పుల బాధకు గుడ్‌బై! సులువైన ఆధ్యాత్మిక పరిష్కారాలు!

ఆలయంలో దేవుడికి ఎదురుగా నిల్చుని నమస్కారం పెట్టుకోకూడదని అంటుంటారు పెద్దలు. కాస్త పక్కకు తిరిగి నిల్చుని నమస్కరించాలి. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనం, కొన్ని ఆలయాల్లో ఆంజనేయుడు, గణపతి కొలువై ఉంటారు. అందుకే మూలవిరాట్ కి ఎదురుగా ఉండే ఆలయానికి మధ్యలో నిల్చోకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఆలయం అంటే సాధారణ భవనం కాదు, ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం నిర్మించిన అత్యంత పవిత్రమైన క్షేత్రం. ముఖ్యంగా మూలవిరాట్ ను వేదమంత్రాల నడుమ ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠలో భాగంగా విగ్రహంలో దైవశక్తిని ఆవాహనం చేస్తారు..అందుకే మూలవిరాట్ ని కేవలం శిలా విగ్రహంగా కాకుండా... స్వామివారుగా, అమ్మవారిగా పూజలందుకుంటుంది.  
 
దైవిక శక్తులు నిక్షిప్తమైన ప్రదేశం

గర్భగుడిలో మంత్రబలం, దైవశక్తులు నిక్షిప్తమై ఉంటాయని ఆగమాలు చెబుతున్నాయ్. అందుకే ఆలయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తుంటుంది. ఆ దైవశక్తిని గౌరవిస్తూ నేరుగా ఎదురుగా నిలబడకుండా పక్కకు జరిగి వంగి నమస్కరిస్తారు. ముఖ్యంగా శివుడు, కాళీ , నారసింహస్వామి లాంటి ఉగ్రస్వరూపం ఉన్న ఆలయాల్లో మరింత వినయంగా వ్యవహరించాలి. శివాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు నంది కొమ్ముల మధ్యనుంచి దర్శించుకోవాలి.  

కర్కాటక రాశిలోకి సూర్యుడు! జూలై 16 నుంచి దంచికొట్టనున్న వానలు, స్టాక్ మార్కెట్ పై ప్రభావం?

ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణ

ప్రాచీన ఆలయాలు ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా నిర్మించారు. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకడం ఇందులో భాగమే. ఇలాంటి సందర్భాల్లో భక్తులు స్వామివారికి ఎదురుగా నిల్చుంటే..ఆ కిరణాల ప్రవాహాన్ని అడ్డుకున్నట్టే..అందుకే పక్కకు జరిగి దర్శనం చేసుకోవాలని చెబుతారు పండితులు.  

ఆలయంలోకి అడుగుపెట్టే ముందు ప్రవేశ ద్వారానికి నమస్కరించి..లోనికి రాగానే ధ్వజస్తంభాన్ని దర్శించుకుని మూలవిరాట్ దర్శనానికి వెళ్లాలి. ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. మగవారు  సాష్టాంగ నమస్కారం, స్త్రీలు మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేయాలి. కాసేపు ప్రశాంతంగా కూర్చుని భగవంతుడి ప్రార్థన చేసి కొద్ది దూరం వెన్నుచూపకుండా నడిచి బయటకు వచ్చేయాలి. 

స్వామివారికి ఎదురుగా నిల్చుని దర్శించుకుంటే ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదు...భక్తి, గౌరవం, దైవసన్నిధిలో వినయం ప్రదర్శించడమే ఈ ఆచారాల వెనుకున్న ఆంతర్యం. భక్తి, శ్రద్ధ, శరణాగతి ఉన్నప్పుడే మీరు చేసుకునే దర్శనానికి పరిపూర్ణత లభిస్తుంది

తమిళ భాష పుట్టుకకు కుమారస్వామి కారణమా.? 'తమిళ్ కడవుల్' ఆసక్తికర చరిత్ర ఇదే!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు అని ఎందుకు అంటారు?

పెద్దలు అలా చేయవద్దని చెబుతారు. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనం లేదా ఇతర దేవతలు ఉంటారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి, మూలవిరాట్ కి ఎదురుగా నిలబడకుండా పక్కకు జరిగి దర్శించుకోవాలి.

ఆలయంలోని గర్భగుడి ప్రత్యేకత ఏమిటి?

గర్భగుడిలో మంత్రబలం, దైవశక్తులు నిక్షిప్తమై ఉంటాయని ఆగమాలు చెబుతున్నాయి. మూలవిరాట్ ను వేదమంత్రాలతో ప్రతిష్టించి దైవశక్తిని ఆవాహనం చేస్తారు. అందుకే గర్భగుడిలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తుంటుంది.

ప్రాచీన ఆలయాలు ఖగోళ శాస్త్రానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి?

ప్రాచీన ఆలయాలు ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం ఇందులో భాగమే. భక్తులు ఎదురుగా నిల్చుంటే ఆ కిరణాల ప్రవాహాన్ని అడ్డుకున్నట్టే అవుతుంది.

ఆలయ ఆచారాలను పాటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?

ఎదురుగా నిల్చుంటే ఏదో జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. భక్తి, గౌరవం, దైవసన్నిధిలో వినయం ప్రదర్శించడమే ఈ ఆచారాల ఆంతర్యం. భక్తి, శ్రద్ధ, శరణాగతితో కూడిన దర్శనానికి పరిపూర్ణత లభిస్తుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Happy Friendship Day 2026: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
Spiritual Energy : జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget