ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!

Published by: RAMA

ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల ప్రశాంతత నెలకొంటుందని నమ్మకం

నిత్యం పూజలు చేసే ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం

శాస్త్రాలలో దైవారాధనకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి...వాటిని పాటించాలి

పూజ చేసేముందు మీ మనసు, శరీరం పవిత్రంగా ఉంచుతోండి..ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి

పూజలో భాగంగా భగవంతుడికి సమర్పించే పూలు తాజాగా ఉండాలి

నీటి కలశాన్ని ఎప్పుడూ పూజా మందిరంలో ఈశాన్య దిశలో ఉంచాలి

నిలబడి పూజ చేయవద్దు..ఆసనంపై కూర్చుని పూజ చేయండి

షోడసోపచార పూజ చేయలేకపోయినా దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరి

పూజా విధానం కన్నా భక్తి ప్రధానం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి