మెడలోంచి మంగళసూత్రం తీయొచ్చా?

Published by: RAMA

మంగళసూత్రం వేసుకునేందుకు నేటితరం వివాహిత స్త్రీలు చాలామంది ఆసక్తి చూపడం లేదు

కొందరు రోజంతా మంగళసూత్రం వేసుకుని..నిద్రపోయేటప్పుడు తీసేసి పక్కన పెట్టేస్తారు

ఇంకొందరు పండుగలు, పూజల సమయంలో వేసుకుని ఆ తర్వాత తీసేసి జాగ్రత్తగా దాచేస్తారు

వాస్తవానికి నిద్రిస్తున్నప్పుడే కాదు ఏ ఇతర సందర్భాల్లోనూ మంగళసూత్రం తీయకూడదు

పెరికిపోతే భర్తతో పసుపుతాడు కట్టించుకుని అప్పుడు మంగళసూత్రం సరిచేసుకుని ధరించాలి

మంగళసూత్రం సరిచేసుకునేందుకు మంచి రోజు, ముహూర్తం చూసుకోవాలి

మంగళసూత్రాన్ని నలుపురంగు పూసలు, పసుపు దారంతోనే ధరించాలి

నలుపు శనీశ్వరుడి చిహ్నం, పసుపు దారం బృహస్పతికి సూచన..

స్త్రీ మెడలో ఉండే నల్లపూసలు వారి జీవిత భాగస్వామిపై చెడు దృష్టి సోకకుండా రక్షిస్తాయి