భూమి కింద ఎన్ని లోకాలు ఉన్నాయి?

Published by: RAMA

పురాణాల్లో భూమి కింద 7 లోకాలు ఉన్నాయని ఉంది.. అవే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ

అతల లోకంలో 96 రకాల మాయా శక్తులను సృష్టించిన మయుని కుమారుడైన 'బాల' అనే అసురుడు నివసిస్తాడు

వితల లోకంలో శివుని రూపం హటకేశ్వరుని నివాసం

వితల లోకంలో హట్కీ నది ప్రవహిస్తుంది

సుతల లోకంలో రాక్షస రాజు బలి నివసిస్తాడు - ఈ లోకానికి బలిని అధిపతిని చేసింది విష్ణువే

సుతల లోకంలో దైత్యులు, దానవులు, నాగులు నివసిస్తారు

తలాతల లోకంలో మాయాజాలానికి రాజు అయిన అసుర మాయుడు నివసిస్తాడు. వీరు అసురుల వాస్తుశిల్పులు

మహాతలంలో ఋషి కశ్యపుని భార్య కద్రువకు పుట్టిన తక్షకుడు , కాళి సహా పలు నాగులు నివసిస్తాయి

చివరి లోకం పాతాళ లోకంలో భూమి బంగారుమయం ఇక్కడ శేషనాగుడు మత్స్య కన్యలు నివసిస్తారు